Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పీసీబీ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన క్రికెట్ ఆస్ట్రేలియా

Australias Refusal Forced Pakistan To Play ODIs In UAE

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో కనీసం రెండు మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో ఆడించాలనుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి నిరాశ తప్పలేదు. ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో భాగంగా తమ దేశంలో రెండు మ్యాచ్‌లు ఆడాలంటూ పీసీబీ చేసిన విజ్ఞప్తిని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) సున్నితంగా తిరస్కరించింది. పాక్‌లో తమ ఆటగాళ్లకు భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందునే ప్రభుత్వ సూచన మేరకు వెనక్కి తగ్గినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది.

సీఏ నిర్ణయంపై పీసీబీ అసంతృప్తి

సీఏ నిర్ణయంపై పీసీబీ అసంతృప్తి

క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయంపై పాక్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఏ నిర్ణయం తమను ఎంతో నిరాశకు గురిచేసిందని పీసీబీ డైరెక్టర్‌ జకీర్‌ ఖాన్‌ తెలిపారు. "ఇది పాకిస్తాన్‌ క్రికెట్‌ ఫ‍్యాన్స్‌ను నిరాశకు గురి చేసే వార్తే. ఆసీస్‌తో పాక్‌లో మ్యాచ్‌లో జరగాలంటే మరికొంత సమయం పట్టేచ్చేమో. అప్పటవరకూ నిరీక్షణ తప్పదు" అని జకీర్‌ ఖాన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

యూఏఈ వేదికగా ఐదు వన్డేల సిరీస్‌

యూఏఈ వేదికగా ఐదు వన్డేల సిరీస్‌

పాక్-ఆస్ట్రేలియా జట్ల మధ్య యూఏఈ వేదికగా ఐదు వన్డేల సిరీస్‌ జరుగనుంది. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి 31 వరకూ ఇరు దేశాల మధ్య ఈ సిరీస్‌ జరుగతుంది. ఇందులో తొలి రెండు వన్డేలు షార్జాలో జరుగుతుండగా, మూడో వన్డే అబుదాబిలో జరుగనుంది. ఇక నాలుగు, ఐదు వన్డేలు దుబాయిలో జరుగుతాయి.

2009 తర్వాత పాక్‌లో పర్యటించని జట్లు

2009 తర్వాత పాక్‌లో పర్యటించని జట్లు

2009లో పాక్‌లో పర్యటించిన శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏ జట్టు కూడా పాక్ వెళ్లేందుకు సాహసించడం లేదు. పాకిస్తాన్‌ భద్రతపరంగా పూరతి హామీ ఇస్తున్నా... టెస్టు క్రికెట్ ఆడే అన్ని దేశాలు అక్కడ క్రికెట్‌ ఆడటానికి మొగ్గుచూపడం లేదు. కొన్ని ఆడపా దడపా సిరీస్‌లు పాకిస్థాన్‌లో జరిగినా ప్రధాన దేశాలతో సిరీస్‌లు ఆడాలన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కల నెరవేరడం లేదు.

Story first published: Monday, February 11, 2019, 12:53 [IST]
Other articles published on Feb 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+