Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్ తరుపున అత్యధిక మ్యాచ్‌లాడిన బ్లాక్‌వెల్ క్రికెట్‌కు రిటైర్మెంట్

Australia's most-capped female player Alex Blackwell announces retirement

హైదరాబాద్: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అలెక్స్ బ్లాక్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. ఆసీస్ తరుపున అత్యధిక మ్యాచ్‌లాడిన మహిళా క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బ్లాక్‌వెల్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది.

2003లో ఇంగ్లాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన 34 ఏళ్ల అలెక్స్ బ్లాక్‌వెల్ మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 251 మ్యాచ్‌లు ఆడింది. ఆస్ట్రేలియా జట్టు సాధించిన అనేక అద్భుత విజయాల్లో పాలుపంచుకుంది. బ్లాక్‌వెల్ తన 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 5250 పరుగులు చేసింది.

వన్డేల్లో 3492, టీ20ల్లో 1314, టెస్టుల్లో 444 పరుగులు నమోదు చేసింది. అంతేకాదు ఆస్ట్రేలియా తరుపున వెయ్యికిపైగా పరుగులు సాధించిన ఏడుగురు మహిళా క్రికెటర్లలో బ్లాక్‌వెల్ ఒకరు కావడం విశేషం. 2010లో వెస్టిండిస్‌లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20 నెగ్గిన ఆసీస్ జట్టుకు బ్లాక్‌వెల్ కెప్టెన్‌గా ఉంది.

అంతేకాదు 2005, 2013లో ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ కప్ నెగ్గడంలో బ్లాక్‌వెల్ కీలక భూమికను పోషించింది. అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్నా... తాను భవిష్యత్‌లో బిగ్‌బాష్ లీగ్‌లో కొనసాగుతానని స్పష్టం చేసింది. బిగ్‌బాష్ లీగ్ ప్రారంభం నుంచి ఆమె సిడ్నీ థండర్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది.

Story first published: Wednesday, February 21, 2018, 13:50 [IST]
Other articles published on Feb 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+