Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టార్గెట్ టీ20 వరల్డ్‌కప్‌: 2020లో ఆస్ట్రేలియా అంతర్జాతీయ మ్యాచ్ షెడ్యూల్ ఇదే!

Australias international cricket schedule for 2020

హైదరాబాద్: బుధవారంతో నూతన సంవత్సరం రానే వచ్చింది. ప్రతి ఏటా లాగా ఈ ఏడాది కూడా క్రికెట్ అభిమానులకు ఎంతో విలువైంది. ఎందుకంటే, అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు ఒలింపిక్స్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్ లాంటి మెగా క్రికెట్‌ టోర్నీలు ఈ ఏడాదిలోనే జరగనున్నాయి.

టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోంది. అంతేకాదు ఆస్ట్రేలియా వేదికగా తొలిసారి జరుగుతున్న తొలి టీ20 వరల్డ్‌కప్ ఇది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా జట్టు ఒక్క టీ20 వరల్డ్‌కప్‌ కూడా నెగ్గలేదు. దీంతో ఈ ఏడాది తమ తొలి టీ 20 వరల్డ్ టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి ఆసీస్ చూస్తుంది.

టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఈ ఏడాది అస్ట్రేలియా బిజీ షెడ్యూల్‌ని కలిగి ఉంది. ఆ షెడ్యూల్ ఏంటో ఒక్కసారి చూద్దాం...


ఆస్ట్రేలియా పర్యటనలో న్యూజిలాండ్, 2019-20
జనవరి 3 నుంచి 7 వరకు: ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, 3వ టెస్టు, సిడ్నీ


భారత పర్యటనలో ఆస్ట్రేలియా, 2020
జనవరి 14: ఇండియా vs ఆస్ట్రేలియా, మొదటి వన్డే, ముంబై
జనవరి 17: ఇండియా vs ఆస్ట్రేలియా, రెండవ వన్డే, రాజ్‌కోట్
జనవరి 19: ఇండియా vs ఆస్ట్రేలియా, మూడవ వన్డే, బెంగళూరు


దక్షిణాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా, 2020
ఫిబ్రవరి 21: దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా, మొదటి టి20, జోహన్నెస్‌బర్గ్
ఫిబ్రవరి 23: దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా, రెండవ టి20, పోర్ట్ ఎలిజబెత్
ఫిబ్రవరి 26: దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా, మూడవ టి20, కేప్ టౌన్

ఫిబ్రవరి 29: దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా, మొదటి వన్డే, పార్ల్
మార్చి 4: దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా, రెండవ వన్డే, బ్లూమ్‌ఫోంటైన్
మార్చి 7: దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా, మూడవ వన్డే, పోట్చెఫ్‌స్ట్రూమ్


ఆస్ట్రేలియా పర్యటనలో న్యూజిలాండ్, 2020
మార్చి 13: ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, మొదటి వన్డే, సిడ్నీ
మార్చి 15: ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, రెండవ వన్డే, సిడ్నీ
మార్చి 20: ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, మూడవ వన్డే, హోబర్ట్


న్యూజిలాండ్ పర్యటనలో ఆస్ట్రేలియా, 2020
మార్చి 24: న్యూజిలాండ్ vs ఆస్ట్రేలియా, మొదటి టి20, డునెడిన్
మార్చి 27: న్యూజిలాండ్ vs ఆస్ట్రేలియా, రెండవ టి20, ఆక్లాండ్
మార్చి 29: న్యూజిలాండ్ vs ఆస్ట్రేలియా, మూడవ టి20, క్రైస్ట్‌చర్చ్


స్కాట్లాండ్‌ పర్యటనలో ఆస్ట్రేలియా, 2020
జూన్ 29: స్కాట్లాండ్ vs ఆస్ట్రేలియా, ఏకైక టీ20, ఎడిన్‌బర్గ్


ఇంగ్లాండ్ పర్యటనలో ఆస్ట్రేలియా, 2020
జూలై 3: ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా, మొదటి టి20, చెస్టర్-లే-స్ట్రీట్
జూలై 5: ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా, రెండవ టి20, మాంచెస్టర్
జూలై 7: ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా, మూడవ టి20, లీడ్స్

జూలై 11: ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా, మొదటి వన్డే, లండన్
జూలై 14: ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా, రెండవ వన్డే, సౌతాంప్టన్
జూలై 16: ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా, మూడవ వన్డే, బ్రిస్టల్


బంగ్లాదేశ్ పర్యటనలో ఆస్ట్రేలియా, 2020
ఇంగ్లాండ్, స్కాట్లాండ్‌లో పర్యటించిన తరువాత ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్‌లో 2 టెస్టులు, 3 టి20ల సిరిస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. మ్యాచ్‌లకు ఖచ్చితమైన తేదీలు ప్రకటించనప్పటికీ, జూలై-అక్టోబర్ మధ్య ఈ సిరీస్ జరుగుతుందని భావిస్తున్నారు.


ఆస్ట్రేలియా పర్యటనలో వెస్టిండిస్, 2020
టి20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా వెస్టిండిస్ జట్టు అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా వెస్టిండిస్ జట్టు 3టి20ల సిరిస్ ఆడనుంది.


ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా
మూడు మ్యాచ్‌ల సిరిస్ కోసం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటన తర్వాత టీమిండియా ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు సన్నద్ధమవుతుంది.


టీ20 ప్రపంచకప్ 2020
అక్టోబర్ 24: ఆస్ట్రేలియా vs పాకిస్తాన్, 13వ మ్యాచ్, సిడ్నీ
అక్టోబర్ 28: ఆస్ట్రేలియా vs వెస్టిండీస్, 21వ మ్యాచ్, పెర్త్
అక్టోబర్ 31: ఆస్ట్రేలియా vs క్వాలిఫైయర్ (టిబిసి), 27వ మ్యాచ్, బ్రిస్బేన్
నవంబర్ 3: ఆస్ట్రేలియా vs క్వాలిఫైయర్ (టిబిసి), 33వ మ్యాచ్, అడిలైడ్
నవంబర్ 6: ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, 38వ మ్యాచ్, మెల్బోర్న్


ఆస్ట్రేలియా పర్యటనలో ఆప్ఘనిస్థాన్, 2020
క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 2020లో ఆస్ట్రేలియా స్వదేశంలో ఆప్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడటం ద్వారా టెస్టు వేసవిని ఆరంభిస్తుంది.


ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా, 2020
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా టీమిండియా వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. దీనికి ముందు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇరు జట్లు తలపడతాయి.

Story first published: Wednesday, January 1, 2020, 17:34 [IST]
Other articles published on Jan 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+