Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక స్కోరు సాధించిన ఆసీస్‌: ఒక‌టి కాదు, రెండు కాదు..!

Australias highest totals in World Cup matches

నాటింగ్‌హామ్‌: ఆస్ట్రేలియా మ‌రో రికార్డును సాధించింది. అల్లాట‌ప్పా రికార్డు కాద‌ది. ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక స్కోరును అత్య‌ధిక సార్లు సాధించిన రికార్డు అది. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ఒక‌టి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు అత్య‌ధిక స్కోరును న‌మోదు చేసిన జ‌ట్టుగా నిలిచిపోయింది. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ ట్రెంట్ బ్రిడ్జిలో గురువారం ఆఫ్ఘ‌నిస్తాన్‌తో మ్యాచ్‌లో మ‌రోమారు భారీ స్కోరును రికార్డు చేసింది ఆస్ట్రేలియా.

1
43669

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మొత్తం 50 ఓవ‌ర్ల‌లో అయిదు వికెట్ల న‌ష్టానికి 381 ప‌రుగులు చేసింది ఆస్ట్రేలియా. ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ చెల‌రేగిపోయి ఆడారు ఈ మ్యాచ్‌లో. 147 బంతుల్లో 166 ప‌రుగులు చేశాడు. ఇందులో అయిదు సిక్స‌ర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. డేవిడ్ వార్న‌ర్‌తో పాటు మ‌రో ఓపెన‌ర్ అరోన్ ఫించ్‌, ఉస్మాన్ ఖ‌వాజాలు అర్ధ‌సెంచ‌రీలు సాధించారు. మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 10 ఓవ‌ర్ల‌లోనే 32 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో- ఆస్ట్రేలియా భారీ స్కోరును సాధించింది.

ఇప్ప‌టిదాకా సాగిన అన్ని ప్రపంచ‌క‌ప్ టోర్న‌మెంట్ల‌లో నాలుగు సార్ల‌ను ఆస్ట్రేలియా భారీ స్కోరును సాధించింది. 2015 ప్రపంచ‌క‌ప్‌లో పెర్త్ స్టేడియం వేదిక‌గా 417 ప‌రుగుల‌ను సాధించింది ఆస్ట్రేలియా. ఆఫ్ఘ‌నిస్తాన్ మీద ఈ భారీ స్కోరును న‌మోదు చేసింది. దీని త‌రువాత‌- ఇదే. నాటింగ్‌హామ్‌లో బంగ్లాదేశ్ మీద అయిదు వికెట్ల న‌ష్టానికి 381 ప‌రుగులు చేసింది. 2007 నాటి ప్ర‌పంచ‌క‌ప్‌లో బ‌స్సెట్టెరెలో 377 ప‌రుగుల‌ను చేసింది. ద‌క్షిణాఫ్రికాపై ఆరు వికెట్ల‌ను కోల్పోయి ఈ స్కోరును సాధించింది. అలాగే- 2015లో సిడ్నీ వేదిక‌గా శ్రీలంక‌పై జ‌రిగిన మ్యాచ్‌లో 376 ప‌రుగులు చేసింది.

బంగ్లాదేశ్‌పై న‌మోదైన అత్య‌ధిక స్కోరులో రెండో స్థానం ఇది..

బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టుపై న‌మోదైన రెండో అత్య‌ధిక స్కోరు ఇది. బంగ్లాదేశ్‌పై మొత్తం నాలుగు సార్లు వేర్వేరు దేశాల క్రికెట్ జ‌ట్లు అత్య‌ధిక స్కోరును న‌మోదు చేశాయి. ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్‌లోనే ఇంగ్లండ్ ఈ ఘ‌న‌త‌ను సాధించింది. బంగ్లాదేశ్‌పై 386 ప‌రుగుల అత్య‌ధిక స్కోరును ఇంగ్లండ్ న‌మోదు చేసింది. కార్డిఫ్‌లో ఈ మ్యాచ్ జ‌రిగింది. కాగా- ఇదొక‌టి. నాటింగ్‌హామ్‌లో 381 ప‌రుగుల‌ను చేసింది ఆస్ట్రేలియా. ఈ రెండింటి కంటే ముందు- 2011 ప్ర‌పంచ‌క‌ప్‌లో బంగ్లాదేశ్‌లోని మీర్‌పూర్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ ఆ దేశ క్రికెట్ జ‌ట్టుపై నాలుగు వికెట్ల న‌ష్టానికి 370 ప‌రుగుల‌ను చేసింది. 2015 ప్ర‌పంచ‌క‌ప్‌లో శ్రీలంక టీమ్ 332 ప‌రుగులు చేసింది.

Story first published: Thursday, June 20, 2019, 20:10 [IST]
Other articles published on Jun 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+