ఆసీస్‌కు మరో దెబ్బ: గాయంతో శ్రీలంక సిరీస్‌కు హాజెల్‌వుడ్ దూరం

హైదరాబాద్: సొంతగడ్డపై టీమిండియాతో ఎదురైన పరాభవం మరిచిపోకముందే ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ జోష్ హాజెల్‌వుడ్ గాయంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు దూరమయ్యాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న హాజెల్‌వుడ్ త్వరలో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొనడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేసింది.
గతేడాది కూడా హాజెల్‌వుడ్ వెన్నునోప్పి గాయంతో ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. హాజెల్‌వుడ్ గాయంపై క్రికెట్ ఆస్ట్రేలియా ఫిజియో డేవిడ్ బెక్లే మాట్లాడుతూ వన్డే వరల్డ్‌కప్ సమయానికల్లా హాజెల్‌వుడ్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాడనే ధీమా వ్యక్తం చేశారు.
స్కానింగ్‌లో కింది వెన్నుభాగంలో ఇబ్బందులున్నట్లు తేలిందని, త్వరలోనే అతనికి పునరావాస శిబిరంలో శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. డే నైట్ టెస్టుగా జరిగే తొలి టెస్టు జనవరి 24న బ్రిస్బేన్ వేదికగా జరగనుంది.
ఆ తర్వాత రెండో టెస్టు ఫిబ్రవరి 1 నుంచి మెల్‌బోర్న్ వేదికగా జరగనుంది. కాగా, ఇటీవలే టీమిండియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఆస్ట్రేలియా జట్టు 2-1తేడాతో చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications