ఇంగ్లాండ్‌పై ద్వేషమే నడిపిస్తుంది: యాషెస్ సిరిస్‌పై వార్నర్
హైదరాబాద్: యాషెస్ టెస్టు సిరిస్ అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు ఎంతో ప్రత్యేకం. యాషెస్ సిరిస్ మొదలవుతుందంటే చాలు ఇరు జట్లకు చెందిన ఆటగాళ్ల మధ్య మాటల దాడి మొదలవుతుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు అమాంతం తమ దూకుడుని ప్రదర్శిస్తారు.

అప్పుడే మొదలైన మాటలదాడి
ఈ మాటల దాడి ఎంతలా ఉంటుందంటే ప్రత్యర్థుల్ని కవ్వించేలా.. తమను తాము సిరీస్‌కు సన్నద్ధంగా చేసుకునేలా ఉంటాయి. తాజాగా భారత పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మీడియాతో మాట్లాడుతూ యాషెస్ తమకు యుద్ధంతో సమానమని.. ఇంగ్లాండ్‌పై ద్వేషమే తమను ఈ సిరీస్‌లో నడిపిస్తుందని అన్నాడు.

మాకు చరిత్ర, గర్వం ఉన్నాయి
'మాకు చరిత్ర, గర్వం ఉన్నాయి. ఎప్పుడైతే ఆ బాటలో అడుగు పెడతామో అప్పుడది యుద్ధమే. సాధ్యమైనంత త్వరగా ఈ యుద్ధంలోకి దిగిపోవాలి. మనల్ని మనం సన్నద్ధం చేసుకోవాలి. ప్రత్యర్థి ఆటగాళ్ల కళ్లల్లోకి చూస్తూ, ఒక్కొక్కరిని ఎంతగా ద్వేషించాలి, అతడిపై ఎలా పైచేయి సాధించాలి అని చూస్తాను' అని వార్నర్ అన్నాడు.

ఇంగ్లాండ్‌పై ద్వేషం పెంచుకోవడం చాలా కీలకం
'వారిపై ద్వేషం పెంచుకోవడం చాలా కీలకం. ప్రత్యర్థిని దెబ్బతీయాలంటే అలాంటి పనే చేయాలి. వారిపై అలాంటి శత్రుత్వం పెంచుకుంటేనే శక్తివంచన లేకుండా కసితో పోరాడగలం' అని వార్నర్ చెప్పాడు. 2013లో బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ పేస్ దాడికి ఇంగ్లిష్ ఆటగాళ్ల కళ్లలో భయం కనిపించిందని వార్నర్ అన్నాడు.

నవంబర్ 23 నుంచి జనవరి 8 వరకు
యాషెస్ సిరిస్ అంటేనే ఆటగాళ్లు తీవ్ర ఉద్వేగంతో మైదానంలో ఆడతారు. ఇదిలా ఉంటే యాషెస్ సిరిస్‌లో భాగంగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ జరగనుంది. ఈ సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ నవంబర్ 23న బ్రిస్బేన్ వేదికగా జరగనుంది. యాషెస్ సిరిస్ నవంబర్ 23న ఆరంభమై జనవరి 8న ముగుస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications