Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్యామిలీని మిస్ అవుతున్నా: కుమార్తెతో వార్నర్ సందడి

హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్ ఆడేందుకు ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చింది. ఈ సిరిస్‌లో ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. ఇరు జట్లు చెరో టెస్టు గెలవడంతో 1-1తో సమమైంది. బెంగుళూరు వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ముగియడంతో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ కుటుంబసభ్యులతో ఎక్కువగా గడుపుతున్నాడు.

వార్నర్ భార్య క్యాండీ ఫాల్జన్‌, ఇద్దరు కుమార్తెలకే వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడు. ఈ సందర్భంగా డేవిడ్‌ భార్య, కుమార్తెలతో సరదాగా గడిపిన కొన్ని ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Australia's David Warner enjoys dinner date with wife after Bengaluru Test

అయితే వార్నర్‌ భార్య, పిల్లలు గురువారం తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నారు. దీంతో వార్నర్ తన కుటుంబసభ్యులను ఎంతో మిస్‌ అవుతున్నట్లు ట్విటర్‌లో కామెంట్ పెట్టాడు. బెంగళూరులో గురువారం ఎంతో బాగా గడిచిందని వార్నర్ పేర్కొన్నాడు.

వార్నర్ కుటుంబ సభ్యులు తిరిగి ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోతున్న సందర్భంగా ఆటగాళ్లు బస చేసిన హోటల్‌ వద్దకు వచ్చిన అభిమానులతో డేవిడ్‌, ఆయన కుమార్తె ఐవీ సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. అంతకుముందు గేమ్స్‌ జోన్‌లో తన భార్య, కుమార్తెలతో కలిసి వార్నర్ సందడి చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+