Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా తరుపున అత్యధిక స్కోరు: చరిత్ర సృష్టించిన డార్సీ షార్ట్

Australia’s D’Arcy Short scripts history, slams highest score in Australia

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఓపెనర్ డార్సీ షార్ట్ చరిత్ర సృష్టించాడు. దేశవాళీ క్రికెట్ టోర్నీలో భాగంగా వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్‌గా డార్సీ షార్ట్ ఆసీస్ తరుపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. క్వీన్స్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డార్సీ షార్ట్ మొత్తం 257 పరుగులు చేశాడు.

ఇందులో 23 సిక్సర్లు ఉండటం విశేషం. హార్ట్స్‌విల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 83 బంతుల్లో సెంచరీ చేసిన షార్ట్ ఆ తర్వాత వంద పరుగులను కేవలం 45 బంతుల్లోనే చేయడం విశేషం. మొత్తం 148 బంతుల్లో 257 పరుగులు చేసిన డార్సీ షార్ట్ ఔటయ్యాడు.

ఇక షార్ట్ కొట్టిన 23 సిక్సర్లు కూడా వన్డే క్రికెట్‌లో అత్యధికం కావడం మరో విశేషం. తద్వారా వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా డార్సీ షార్ట్ నిలిచాడు. ఇక, లిస్ట్-ఏ క్రికెట్ విషయానికి వస్తే 2002లో సర్రే టీమ్ తరఫున ఆడిన అలిస్టర్ బ్రౌన్ 268 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.

డార్సీ షార్ట్‌కు ముందు దేళవాళీ క్రికెట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 23 సిక్సులు బాదిన బ్యాట్స్‌మెన్‌గా న్యూజిలాండ్ క్రికెటర్ కొలిన్ మున్రో నిలిచాడు. తాజాగా, డార్సీ షార్ట్ కూడా దేశవాళీ క్రికెట్‌లో 23 సిక్సులు బాదిన ఆటగాడిగా అతడి సరసన నిలిచాడు.

ఈ ఏడాది కార్డిఫ్ వేదికగా ఇంగ్లాండ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన డార్సీ షార్ట్ ఆస్ట్రేలియా తరుపున 10 టీ20లు ఆడాడు. ఇదిలా ఉంటే, అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత్‌కు చెందిన రోహిత్ శర్మ 264 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత షార్ట్ చేసిన ఈ 257 పరుగులు మూడో అత్యధికం. షార్ట్ 257 పరుగులు చేయడంతోపాటు వెస్టర్న్ ఆస్ట్రేలియా టీమ్ 47 ఓవర్లలో 387 పరుగులు చేసి ఆలౌటైంది.

Story first published: Friday, September 28, 2018, 14:44 [IST]
Other articles published on Sep 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+