ఇదొక పరీక్షలాంటింది.. గెలిచి మా సత్తా ఏంటో చూపిస్తాం: స్టీవ్ వా

హైదరాబాద్: స్వదేశంలో మంచి రికార్డు ఉన్నప్పటికీ విదేశంలో సైతం గెలిచి తమ జట్టు అసలు సత్తా ఏమిటో చూపిస్తుందని ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా పేర్కొన్నాడు. ఆసీస్ జట్టు విదేశాల్లో నిరూపించుకోవడానికి సఫారీ పర్యటన ఒక అవకాశమన్నాడు. తమ జట్టు గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ మా జట్టు ఎలా ఉందనేది దక్షిణాఫ్రికాలో తేలిపోతుందన్నాడు.
2018 లారెస్ స్పోర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన స్టీవ్ వా మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికా పర్యటన అనేది కచ్చితంగా ఆసీస్‌కు ఒక పరీక్షలాంటిదేనన్నాడు. స్వదేశంలో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సత్తాచాటే స్మిత్ జట్టుకు సఫారీలతో సిరీస్‌లో సవాల్ తప్పదన్నాడు.
ఒకవేళ ఇక్కడ రాణిస్తే మాత్రం మిగతా విదేశీ పర్యటనల కూడా ఆసీస్‌కు సానుకూలంగా ఉంటాయని స్టీవ్ వా విశ్లేషించాడు. ఇటీవల న్యూజిలాండ్-ఇంగ్లండ్‌లతో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌ల్లో ఒక్క అపజయం కూడా లేకుండా టైటిల్‌ను సాధించిన సంగతి తెలిసిందే. ఆ టైటిల్ సాధించిన తర్వాత ఆసీస్‌కు ఇదే తొలి పర్యటన.
కానీ, ఇటీవల భారత్‌తో జరిగిన మూడు సిరీస్‌లలో సఫారీ జట్టు రెండు సిరీస్ లను ఓడిపోయి తొలి సిరీస్ మాత్రమే చేజిక్కించుకుంది. గాయాల కారణంగా సీనియర్ క్రికెటర్లు జట్టులో లేకపోవడంతో ప్రస్తుతం జట్టు బలహీనంగా కనిపిస్తోంది. మరి పర్యాటక జట్టుతో పోటీపడేందుకు స్వదేశీ ఆటగాళ్లు సిద్ధమైతే.. అంతర్జాతీయ స్థాయి జట్టులలో ప్రధానమైన ఆస్ట్రేలియాను ఎలా ఎదుర్కొనబోతుందనేది ప్రశ్నార్థకం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications