Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జస్ట్ మిస్: తలను తాకిన బంతి, కోమాలోకి వెళ్లేవాడు

సిడ్నీ: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఆడమ్ వోజస్ తలకు బంతి బలంగా తాకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా గురువారం మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున ఆడుతున్న వోజస్ బంతిని అంచనా వేయడంలో విఫలం కావడంతో బంతి అతని తలని బలంగా తాకింది.

వివరాల్లోకి వెళితే.... తస్మానియా జట్టు బౌలర్ కామ్ స్టీవెన్ సన్ విసిరిన బంతిని ఆడే క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బంతి తలను బలంగా తాకడంతో వోజస్ క్రీజులోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఫీల్డర్లు మెడికల్ స్టాఫ్‌కి సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని వోజస్‌ను ఆసుపత్రికి తరలించారు.

 Australia's Adam Voges suffers head injury by bouncer to helmet

దీంతో 16 పరుగుల వద్ద వోజస్ రిటైర్డ్ హట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం వోజస్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడో టెస్టుకు వోజస్ అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా జట్టు తరుపున వోజస్ 20 టెస్టులు, 31 వన్డేలు, 7 టీ20లు ఆడాడు.

టెస్టుల్లో వోజస్ యావరేజి 61.87గా ఉంది. ఇదే తరహాలో వోజస్ గాయపడటం ఈ ఏడాది రెండోసారి. ఈ ఏడాది మొదట్లో మిడిల్‌సెక్స్‌లో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడుతూ వోజస్ గాయపడ్డాడు. వోజస్ గాయం గతంలో మరణించిన ఆస్ట్రేలియా టెస్టు ఓపెనర్ ఫిల్ హ్యూస్ మరణాన్ని గుర్తుకు తెచ్చింది.

నవంబర్ 25, 2014న సిడ్నీలో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో బంతి బలంగా తాకడంతో ఫిల్ హ్యూస్ ఆసుపత్రిలో చేరి నవంబర్ 27న మరణించిన సంగతి తెలిసిందే. ఫిల్ హ్యూస్ మరణం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఎంతగానో కలచివేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+