Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియాకు టీమిండియా మాజీ ఆటగాడి సాయం

సిడ్నీ: భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడి సాయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఏ) కోరింది! 2000 కాలంలో శ్రీరామ్ శ్రీధరన్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అతను ఎనిమిది వన్డేలు ఆడాడు. తమిళనాడుకు చెందిన ఇతను ఆ తర్వాత కనుమరుగయ్యాడు.

2004లో చివరి వన్డే ఆడాడు. ఆ తర్వాత అతను కనిపించలేదు. నాలుగేళ్ల క్రితం రిటైరయ్యాడు. ఆ శ్రీరామ్‌ను వచ్చే ట్వంటీ 20 ప్రపంచకప్‌ కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా సలహాదారుగా నియమించుకుంది.

Australia rope in ex-India player Sridharan Sriram for 2016 World Twenty20

ఆస్ట్రేలియా ఎ జట్టు ఈ ఏడాది భారత్‌లో పర్యటించినపుడు శ్రీరామ్‌ సాయం తీసుకున్నామని, ట్వంటీ 20 ప్రపంచ కప్‌ సందర్భంగా భారత్‌లో పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో తమ ఆటగాళ్లకు అతను అవగాహన కల్పిస్తాడని చెప్పింది.

శ్రీరామ్ శ్రీధరన్ ఆల్ రౌండర్. 200-2004 మధ్య భారత జట్టుకు ఎనిమిది వన్డేలు ఆడాడు. ఇతని వయస్సు 39 ఏళ్లు. భారత్‌లో ఎదుర్కొనే పరిస్థితుల పైన శ్రీరామ్ తమ ఆటగాళ్లను ప్రిపేర్ చేసే విషయంపై దృష్టి సారించాడని క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన హోవార్డ్ చెప్పాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+