న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: స్వదేశీ నేపథ్యమున్న జెర్సీతో బరిలోకి దిగబోతున్న ఆస్ట్రేలియా..!

Australia Revealed Indigineous Jersey for T20 World Cup

టీ20 వరల్డ్ కప్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా బుధవారం ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ‌కప్ - 2022 జెర్సీని రివీల్ చేసింది. పూర్తి డ్రెస్ కోడ్‌తో కూడా దేశీయ నేపథ్య కిట్‌ను రిలీజ్ చేసింది. ఆరోన్ ఫించ్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు తమ T20ప్రపంచకప్ టైటిల్‌ను కాపాడుకోవడానికి తొలిసారిగా స్వదేశీ నేపథ్యమున్న జెర్సీ కిట్‌ను ధరించబోతోంది. సొంత గడ్డపై ఆస్ట్రేలియా భారీ అంచనాలతో బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. కొత్త జెర్సీలో నల్లని స్లీవ్‌లతో కూడిన షర్టులు, ట్రంక్‌పై గోల్డ్ మరియు గ్రీన్ గ్రేడియంట్ కళాకృతులు ఉన్నాయి. కిట్‌ను ఆంటీ ఫియోనా క్లార్క్, కోర్ట్నీ హెగెన్ రూపొందించారు.

ఇకపోతే ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో గ్రూప్ 1లో ఉంది. ఆ జట్టుతో పాటు న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లు ఇప్పటికే బెర్త్‌లు పొందాయి. ఇక మరో రెండు జట్లు క్వాలిఫయర్‌లలో గెలిచి గ్రూప్ 1లోకి వస్తాయి. ఇక గతేడాది టీ20 ప్రపంచకప్ టీంలో కేవలం ఒకే ఒక్క మార్పు చేసి ఈసారి ఆసీస్ బరిలోకి దిగబోతుంది. లెగ్ స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్ స్థానంలో బిగ్ హిట్టర్ టిమ్ డేవిడ్‌ని ఆ జట్టు తీసుకుంది. టిమ్ డేవిడ్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున చిచ్చర పిడుగులా ఆడిన సంగతి తెలిసిందే. ఇక సింగపూర్ దేశానికి చెందిన టిమ్ డేవిడ్ మూలాలు మాత్రం ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. అందువల్ల అతన్ని ఆసీస్ జట్టు కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకుంది. ఇక సింగపూర్ వాసి ఆసీస్ జట్టులో ఆడడం విశేషమేననే చెప్పాలి. ఇకపోతే ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల టిమ్ డేవిడ్ తప్పకుండా ఆసీస్ తుది జట్టులో ఒకడిగా ఉండడం ఖాయంగా కన్పిస్తుంది.

ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ జట్టు:
ఆరోన్ ఫించ్ (కెప్టెన్ ), పాట్ కమ్మిన్స్ (వైస్ కెప్టెన్), అష్టన్ అగర్, టిమ్ డేవిడ్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవెన్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ , డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా

Story first published: Wednesday, September 14, 2022, 11:52 [IST]
Other articles published on Sep 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X