1000 విజయాలు: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా అరుదైన రికార్డు

హైదరాబాద్: ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టు అరుదైన రికార్డు సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 1000వ విజయాన్ని నమోదు చేసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా టీమిండియాతో సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 34 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ విజయం ఆస్ట్రేలియా జట్టుకు అంతర్జాతీయ క్రికెట్‌లో 1000వ విజయం. ఫలితంగా క్రికెట్ చరిత్రలోనే ఈ మైలురాయిని చేరిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా అరుదైన ఘతన సాధించింది. టెస్టుల్లో 384 విజయాలు సాధించిన ఆస్ట్రేలియా.. వన్డేల్లో 558, టీ20ల్లో 58 విజయాలు అందుకుంది.

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో విజయం
1877లో మెల్‌బోర్న్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా తొలి విజయాన్ని రుచి చూసింది. ఆ తర్వాత ప్రపంచ క్రికెట్‌లో అనేక రికార్డులను నమోదు చేసింది. తన 100వ అంతర్జాతీయ విజయాన్ని 1951లో వెస్టిండీస్‌పై సాధించగా, 200వ విజయాన్ని 1981లో భారత్‌పై సాధించింది.

పాకిస్తాన్‌పై 500వ విజయం
ఇక 300, 400 విజయాలను ఇంగ్లాండ్‌పైనే ఆస్ట్రేలియా నమోదు చేయడం విశేషం. 1989లో 300వ విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆస్ట్రేలియా.. 1994లో 400 విజయాన్ని సాధించింది. 500వ విజయాన్నిపాకిస్తాన్‌పై(1999లో), 600వ విజయాన్ని వెస్టిండీస్‌పై(2003), 700వ విజయాన్ని భారత్‌పై(2006లో), 800వ విజయాన్ని పాకిస్తాన్‌పై(2010లో), 900వ విజయాన్ని ఇంగ్లండ్(2014)పై సాధించింది.

రెండో స్థానంలో ఇంగ్లాండ్
అంతర్జాతీ క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో ఇంగ్లాండ్ కొనసాగుతోంది. ఇంగ్లాండ్ ఇప‍్పటివరకూ 774 విజయాలు సాధించింది. ఇక భారత్ 711 విజయాలతో మూడో స్థానంలో ఉంది. వన్డే విజయాల పరంగా చూస్తే భారత్ రెండో స్థానంలో ఉంది. వన్డే ఫార్మాట్‌లో భారత్ సాధించిన విజయాల సంఖ్య 492గా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications