హైదరాబాద్: వరుసగా 18 టెస్టులను గెలిచి జోరుమీదున్న కోహ్లీ సేనను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా సరికొత్త ప్రణాళికలను రచిస్తోంది. ఉపఖండం పిచ్‌లపై పట్టు సాధించేందుకు దుబాయ్‌లోని ఐసీసీకి చెందిన స్టేడియాల్లో ఆస్ట్రేలియా తమ ఆటగాళ్లతో సాధన చేయనుందని తెలుస్తోంది.
ఈ రకంగా దుబాయ్‌లో కొంతవరకూ ప్రాక్టీస్ లభిస్తే, భారత్‌లో పిచ్‌లపై ఆడటం సులభతరం అవుతుందని ఆస్ట్రేలియా జట్టు అధికారులు భావిస్తున్నారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు దుబాయిలో కసరత్తులకు శ్రీకారం చుట్టింది.
2004 నుంచి భారత్‌లో ఆస్ట్రేలియా సిరిస్ గెలవలేదు. 2013లో చివరిసారిగా భారత్‌లో పర్యటించి ఆడిన నాలుగు టెస్టుల్లో ఓటమి పాలైంది. మళ్లీ అలాంటి ఘోర ఓటమి పునరావృతం కాకూడదనే తలంపుతో సమగ్రమైన ప్రణాళికతోనే భారత పర్యటనకు రావాలని భావిస్తోంది.
ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్ధానంలో ఉన్న టీమిండియా వరుసగా ఐదు టెస్టు సిరిస్‌లను గెలిచి 18 టెస్టుల్లో ఓటమి లేకుండా విజయయాత్ర కొనసాగిస్తోంది. ఈ క్రమంలో భారత్‌ను కట్టడి చేయాలంటే ఆస్ట్రేలియా పూర్తి ప్రదర్శన చేయాల్సి ఉంది. ఈ క్రమంలో దుబాయిలో ఆస్ట్రేలియా ప్రాక్టీస్‌కు వెళ్లనుంంది.

'అన్ని చోట్ల భారత్ తరహా పిచ్‌లు ఉండవు. దుబాయిలోని భిన్నమైన పిచ్‌లపై ప్రాక్టీస్ చేస్తే మాకు చాలా వరకూ ప్రిపరేషన్ లభిస్తుంది' అని ఆసీస్ జనరల్ మేనేజర్ పాట్ హోవార్డ్ పేర్కొన్నారు. దుబాయిలో ఐసీసీ రూపొందించిన పిచ్‌లు చాలా బాగున్నాయంటూ ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
భారత్‌లోని పిచ్‌లు చాలా వైవిధ్యంగా ఉంటాయంటూ పేర్కొన్నారు. భారత పర్యటనలో తమ టార్గెట్ రవిచంద్రన్ అశ్విన్, జడేజాలు మాత్రమే కాదని, మొత్తంగా టీమిండియాను ఎలా కట్టడి చేయాలనే దానిపైనే తమ వ్యూహం ఉంటుందని హోవార్డ్ అన్నారు. ఇది ఇలా ఉంటే 2016లో భారత జట్టు వరల్డ్ నెంబర్ వన్ జట్టుగా ముగించిన సంగతి తెలిసిందే.