AUS Playing 11 vs PAK: ఫామ్‌లోకి వార్నర్.. సత్తాచాటాని మాక్స్‌వెల్! బరిలోకి దిగే ఆసీస్ జట్టు ఇదే!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2021 రెండో సెమీ ఫైనల్‌లో పాకిస్థాన్, ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గురువారం (నవంబర్ 11)న దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనుంది. రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకునే దిశగా పాకిస్థాన్ బరిలోకి దిగుతుండగా.. ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచకప్‌పై కన్నేసింది. పాకిస్తాన్ జట్టుకు మెగా టోర్నీలో ఒక్క ఓటమి లేదు.
మరోవైపు సరైన సమయంలో ఆస్ట్రేలియా ఫాంలోకి వచ్చింది. అంతేకాకుండా నాకౌట్ మ్యాచ్‌లలో కంగారూ జట్టు చాలా ప్రాణాంతకంగా తయారైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. కీలక సెమీస్ మ్యాచ్ నేపథ్యంలో ఆసీస్ ప్లేయింగ్ 11ను ఓసారి పరిశీలిద్దాం.

రికార్డ్స్ అండ్ పిచ్ రిపోర్ట్
పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటలకు టాస్ పడనుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను వివిధ భాషలలో చూడవచ్చు. అలానే డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్‌తో మ్యాచ్‌ను ఫాన్స్ ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు.
పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు మొత్తం 22 టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. పాకిస్థాన్ 13, ఆస్ట్రేలియా 9 మ్యాచ్‌లు గెలిచింది. టీ20 ప్రపంచకప్‌లలో ఇప్పటివరకు ఇరుజట్లు ఆరుసార్లు తలపడ్డాయి. ఇందులో పాకిస్థాన్ మూడు, ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌లు గెలిచాయి. ఇరు జట్లు చివరిసారిగా 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో తలపడ్డాయి. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వగా.. మొహాలీలో జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా గెలిచింది.
సెమీఫైనల్ జరగనున్న దుబాయ్ పిచ్‌పై టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు నిర్వహించారు. బ్యాటింగ్‌కు అనుకూలమైన ఈ పిచ్‌పై మంచు ప్రభావం చూపొచ్చు. టాస్ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం.

ఫామ్‌లోకి వార్నర్
ఇంగ్లండ్ చేతిలో 8 వికెట్ల పరాజయాన్ని మినహాయిస్తే ఆస్ట్రేలియా మెగా టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసింది. తనదైన శైలిలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సెమీస్‌కు చేరుకుంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫామ్‌లోకి రావడం ఆసీస్ జట్టుకు పెద్ద సానుకూలాంశం. గత మ్యాచ్‌లో 89 పరుగులతో వార్నర్ అజేయంగా నిలిచాడు. ఆరోన్ ఫించ్ కూడా బ్యాట్ జుళిపిస్తున్నాడు. ఓపెనింగ్ జోడి వార్నర్, ఫించ్‌లు ఎలాంటి బౌలింగ్‌లోనైనా చెలరేగగలరు.
మూడో స్థానంలో వచ్చే మిచెల్ మార్ష్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. వికెట్లు పడితే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడానికి స్టీవ్ స్మిత్ ఉన్నాడు. ఇప్పటివరకు పెద్ద మెరుపులు మెరిపించలేకపోయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ఈ మ్యాచ్‌లోనైనా బ్యాటుతో విరుచుకుపడాలని ఆసీస్ కోరుకుంటోంది. ఇదే జరిగే పాక్ బౌలర్లకు చుక్కలు కనబడడం ఖాయం. హిట్టర్ మార్కస్ స్టోయినిస్ కూడా జట్టును ఆదుకోగలడు. అయితే వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ ఫామ్ అందుకోవాల్సి ఉంది.

పటిష్టంగా బౌలింగ్
ఆస్ట్రేలియాకు ఎప్పటిలానే పటిష్ట బౌలింగ్ దళం ఉంది. జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్‌లతో ఆసీస్ పేస్ విభాగం బలంగా ఉంది. ఈ త్రయం ఎలాంటి బ్యాటర్లను అయినా ఇబ్బందిపెట్టగలరు. ముఖ్యంగా ఐపీఎల్ 2021 నుంచి హేజిల్‌వుడ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. యువ లెగ్‌స్పిన్నర్ ఆడమ్ జంపా మధ్య ఓవర్లలో క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతున్నాడు.
మెగా టోర్నీలో ఓ మ్యాచులో ఐదు వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. ఇక ఆల్‌రౌండర్లు గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్‌లు కూడా వికెట్లను అందించారు. మార్కస్ స్టోయినిస్ రూపంలో ఆసీస్‌కు మరో బౌలర్ కూడా అందుబాటులో ఉన్నాడు. అందరూ సమిష్టిగా రాణిస్తే ఆసీస్ ఫైనల్ చేరడం ఖాయం.

ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా)
డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications