Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Australia playing 11 for First ODI : స్టార్క్ ఔట్.. కమ్మిన్స్ ఇన్, శ్రీలంకతో తొలి వన్డేకు ఆసీస్ జట్టు ఇదే

Australia playing 11 for first ODI against Sri Lanka, Mitchell Starc out, Pat Cummins into final squad

శ్రీలంకతో అయిదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ రేపు శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా ప్రారంభం కానుంది. కాగా తొలి వన్డేకు ఆస్ట్రేలియా తమ ప్లేయింగ్ 11 టీంను ప్రకటించింది. ఇక ఆస్ట్రేలియా జట్టులోని స్టార్‌ ఆటగాళ్లు అయిన మిచెల్‌ స్టార్క్‌, కేన్‌ రిచర్డ్‌సన్, మిచెల్‌ మార్ష్‌ గాయాల వల్ల తొలి వన్డేకు సెలెక్ట్ కాలేదు. మిచెల్ స్టార్క్.. టీ20 సిరీస్లో 2,3 వ మ్యాచ్‌లకు ఫిట్ నెస్ సమస్యల వల్ల దూరమయ్యాడు. వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వస్తాడనుకుంటే ఇంకా అతని సమస్య తొలగకపోవడంతో తొలి వన్డేకు దూరం కాక తప్పలేదు. ఇక టీ20 సిరీస్‌కు ఎంపిక కానీ టెస్ట్ జట్టు కెప్టెన్, స్టార్‌ పేసర్‌ పాట్‌ కమ్మిన్స్‌ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు.

ఇక ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. చివరి టీ20‌మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఆఖరి మూడు ఓవర్లలో 59పరుగులను డిఫెండ్ చేసుకోలేక ఓడిపోయింది. శ్రీలంకన్ కెప్టెన్ దసున్ షనక వీరవిహారం చేయడంతో మరో బంతి మిగిలి ఉండగానే చివరి టీ20ల్లో శ్రీలంక సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక అదే ఊపును శ్రీలంక వన్డే సిరీస్‌లో కొనసాగించాలని చూస్తుండగా.. ఆస్ట్రేలియా మాత్రం టీ20 సిరీస్ విజయం లాగే.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని సన్నాహాలు రచిస్తోంది.

హెడ్-టు-హెడ్: శ్రీలంక, ఆస్ట్రేలియా ఇప్పటివరకు 97 వన్డే మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో శ్రీలంక 32మ్యాచ్‌లు గెలవగా.. ఆస్ట్రేలియా 61మ్యాచ్‌లు గెలిచింది. ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు ఎలాంటి ఫలితం లేకుండా ముగిశాయి. శ్రీలంకలో ఇరు జట్లూ 30 వన్డేల్లో తలపడగా.. ఆతిథ్య జట్టు 14సార్లు గెలవగా.. ఆస్ట్రేలియా 13సార్లు గెలిచింది. మూడు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి.

శ్రీలంకతో తొలి వన్డేకి ఆస్ట్రేలియా తుది జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషేన్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, అలెక్స్ కారీ, అష్టన్ అగర్, పాట్ కమిన్స్, జో రిచర్డ్‌సన్, జోష్ హేజిల్‌వుడ్

Story first published: Monday, June 13, 2022, 22:54 [IST]
Other articles published on Jun 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+