Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Australia Playing 11 For 1st T20 Against Srilanka: వార్నర్, స్మిత్ వచ్చేశారు.. బరిలోకి వరల్డ్ కప్ టీం

Australia Playing 11 For 1st T20 Against Srilanka, David Warner, Steve Smith comeback to the Team

టీ20, వన్డే, టెస్ట్ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా టీం శ్రీలంకలో పర్యటించనుంది. తొలుత 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జూన్ 7న శ్రీలంకలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ప్రారంభమయ్యే తొలి టీ20 మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా తమ ప్లేయింగ్ 11టీంని ప్రకటించింది. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2021 ఫైనల్‌లో ఆడిన ప్లేయింగ్ 11టీంలో ఏడుగురు ప్లేయర్లు తిరిగి తుది జట్టులో ఎంపికయ్యారు.

దీంతో దాదాపు వరల్డ్ కప్ టీంనే ఆస్ట్రేలియా బరిలోకి దించుతున్నట్లు అర్థమవుతుంది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ తిరిగి టీ20 జట్టులో చేరడం గమనార్హం. ఇక వార్నర్, స్మిత్ ఫిబ్రవరిలో శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్, పాకిస్తాన్‌తో T20సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

ఇక డేవిడ్ వార్నర్ ఇటీవలి ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున మంచి ఫాం కనబరిచిన సంగతి తెలిసిందే. 12 మ్యాచ్‌లలో 48సగటుతో 432పరుగులను సాధించాడు. ఇక స్మిత్ చివరిసారిగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. అనంతరం టీ20, వన్డే సిరీస్‌లు లేకపోవడంతో విశ్రాంతి తీసుకున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌ ఆసీస్‌ సాధించిన తర్వాత ఆ జట్టులోని అగ్రశ్రేణి ప్లేయర్లు మళ్లీ జట్టుతో పాటు ఆడడానికి ఇదో మంచి అవకాశమనే చెప్పాలి.

ఇక ఈ సిరీస్‌లో టీ20 స్క్వాడ్లో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్, బౌలర్ ఆడమ్ జంపా ఎంపిక కాలేదు. వేర్వేరు కారణాల వల్ల వీరిద్దరిని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సెలెక్ట్ చేయలేదు. వీరు త్వరలోనే మళ్లీ సెలెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక కేన్ రిచర్డ్‌సన్, ఆష్టన్ అగర్ స్క్వాడ్‌లో చోటుదక్కించుకున్నాడు.

మొదటి టీ20 మ్యాచ్ కోసం బెంచ్ ప్లేయర్లుగా జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, ఝై రిచర్డ్సన్, మిచెల్ స్వెప్సన్ ఉన్నారు. మూడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల తర్వాత 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరుగుతుంది. వన్డే టీంలోనూ వార్నర్, స్మిత్‌లు ఎంపికయ్యారు. ఆ తర్వాత రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌తో ఆస్ట్రేలియా పర్యటన ముగుస్తుంది.

శ్రీలంకతో తొలి టీ20కి ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్ టీం: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్‌సన్, జోష్ హేజిల్‌వుడ్

Story first published: Monday, June 6, 2022, 13:52 [IST]
Other articles published on Jun 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+