
తొలిమ్యాచ్‌లో ఆసీస్..
మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్‌లో 200లకు పైగా స్కోర్‌ను కొట్టి అవతల పడేసింది ఆస్ట్రేలియా. అనూహ్యంగా భారత జట్టుకు హైఓల్టేజ్ షాక్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 208 పరుగులు చేయగా- దాన్ని ఛేదించారు ఆస్ట్రేలియన్లు. 19.2 ఓవర్లల్లో ఆరు వికెట్లను కోల్పోయి 211 పరుగులు చేశారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యతను సాధించారు.

అక్కడ సీన్ రివర్స్..
నాగ్‌పూర్ మ్యాచ్‌లో సీన్ రివర్స్ అయింది. టీమిండియా అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అయింది. వర్షం వల్ల ఎనిమిది ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు మట్టికరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఎనిమిది ఓవర్లల్లో 90 పరుగులు చేయగా.. టీమిండియా దాన్ని అవలీలగా కొట్టేసింది. ఆస్ట్రేలియాపై ప్రతీకార విజయాన్ని అందుకుంది. ఇప్పుడిక హైదరాబాద్ వంతు వచ్చింది. ఇది సిరీస్ డిసైడర్ కావడంతో అందరి కళ్లూ ఈ మ్యాచ్ మీదే నిలిచాయి.

డెత్ ఓవర్లపై
కీలకమైన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియాను ఢీ కొట్టడానికి సమాయాత్తమౌతోంది. ఆచితూచి ప్లేయర్లను ఎంపిక చేయనుంది. తుదిజట్టులో కీలక మార్పులు చేయనుంది. భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులకు దిగనుంది. ప్రత్యేకించి- డెత్ ఓవర్లల్లో భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగడం, అదే డెత్ ఓవర్లల్లో బ్యాటర్లను కట్టడి చేయడానికి అనుగుణంగా తుదిజట్టును ఎంపిక చేయనుంది.

ఏడుమంది బ్యాటర్లు..
ఏడుమంది బ్యాటర్లకు తుదిజట్టులో చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. జోష్ ఇంగ్లిస్‌ను మిడిలార్డర్‌లో పంపేలా వ్యూహాలను రూపొందించుకుంది. సీన్ అబాట్, డేనియల్ సామ్స్‌లను తుదిజట్టులోకి తీసుకోవచ్చు. ఎల్లిస్ వందశాతం ఫిట్‌తో ఉంటే అతనికి జట్టులో చోటు దక్కడం ఖాయం. కమ్మిన్స్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపాలను డెత్ ఓవర్లల్లో వినియోగించుకోవచ్చు.

తుదిజట్టు అంచనాలు..
ఆస్ట్రేలియా తుదిజట్టులో- ఆరోన్ ఫించ్ (కేప్టెన్), కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), డేనియల్ సామ్స్, సీన్ అబాట్, పాట్ కమ్మిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. టీమిండియాలో- రోహిత్ శర్మ (కేప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ లేదా రవిచంద్రన్ అశ్విన్ ఆడొచ్చు.


Click it and Unblock the Notifications
