Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అసలేం జరిగింది?: నిరుద్యోగులుగా మారిన ఆస్ట్రేలియా క్రికెటర్లు

హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్‌ ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ), ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం (ఏసీఏ) మధ్య తలెత్తిన జీతాల గొడవ తారాస్థాయికి చేరుకుంది. ప్రతిపాదిత నూతన ఆదాయ పంపిణీ విధానం గురించి చర్చించేందుకు ఆటగాళ్లకు సీఏ నిర్దేశించిన గడువు జూన్ 30(శనివారం)తో ముగిసింది.

అటు బోర్డు, ఇటు క్రికెటర్లు ఎవ్వరూ పంతం వీడలేదు. జీతభత్యాల వివాదం ఓ కొలిక్కి రాకపోవడంతో ఆస్ట్రేలియా క్రికెట్‌ భవిష్యత్తు అంధకారంలో పడింది. బోర్డుతో ప్రస్తుతం ఉన్న ఒప్పందం శనివారంతో ముగియంతో ఆసీస్‌కు చెందిన 230 క్రికెటర్లు నిరుద్యోగులుగా మారారు. వాస్తవానికి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరపున బరిలోకి దిగాలంటే ప్రతిపాదిత కొత్త ఒప్పందంపై ఆటగాళ్లు సంతకాలు చేయాల్సి ఉంది.

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆసీస్ క్రికెటర్లు

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆసీస్ క్రికెటర్లు

అయితే దానిని తీవ్రంగా వ్యతిరేకించిన ఆసీస్ క్రికెటర్లు అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆస్ట్రేలియా తరపున ఆడుతున్న పురుష, మహిళా క్రికెటర్లు నిరుద్యోగులుగా మారిపోయారు. వారు ఇకపై ఎలాంటి మ్యాచ్‌లు ఆడటానికి వీల్లేదు. ఏడాదికి మించి ఒప్పందం కలిగిన ఆటగాళ్లు మాత్రమే ఆస్ట్రేలియా తరఫున ఆడేందుకు అర్హులు.

ప్రశ్నార్థకంగా మారిన ఆస్ట్రేలియా క్రికెట్ భవిష్యత్

ప్రశ్నార్థకంగా మారిన ఆస్ట్రేలియా క్రికెట్ భవిష్యత్

అలా కొద్దిమంది ఆటగాళ్లే ఉన్నందున.. ఆస్ట్రేలియా ఆడాల్సిన టోర్నీలన్నీ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. దీంతో పాటు జులైలో దక్షిణాఫ్రికాలో ఆస్ట్రేలియా ఎ జట్టు పర్యటనే అనుమానాస్పదంగా మారింది. జులైలో భారత్ ఎ, దక్షిణాఫ్రికా ఎ జట్లతో ఆస్ట్రేలియా ఎ జట్టు ముక్కోణపు సిరీస్ ఆడాల్సి ఉంది. ఇందుకోసం ఆ జట్టు దక్షిణాఫ్రికా పయనం కావాల్సి ఉంది.

యాషెస్‌ సిరీస్‌‌పై అనుమానాలు

యాషెస్‌ సిరీస్‌‌పై అనుమానాలు

ప్రస్తుత వివాదం నేపథ్యంలో ఆ పర్యటన అనుమానాస్పదంగా మారింది. ఒకవేళ సమస్య ఇలాగే కొనసాగితే మాత్రం ఆగస్టులో బంగ్లాదేశ్‌లో టెస్టు సిరీస్‌.. సెప్టెంబరులో భారత్‌లో వన్డే సిరీస్‌తో పాటు.. ఈ ఏడాది ఆఖర్లో జరగనున్న యాషెస్‌ సిరీస్‌‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ జరగనున్న తరుణంలో ఆసీస్ క్రికెటర్లు మొండికేయడం సీఏకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే అప్పటిలోగా జీతాల సమస్యకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ముగింపు పలికే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

జీతాల విషయంలో ఎందుకీ గొడవ?

జీతాల విషయంలో ఎందుకీ గొడవ?

ప్రస్తుత జీతాల ఒప్పందం ప్రకారం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) క్రికెట్‌ ఆదాయంలో 25 శాతాన్ని క్రికెటర్లకు పంచుతోంది. ఈ విధానానికి మార్పుచేర్పులు చేసి వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరుగా జీతభత్యాలు ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించింది. ఆదాయ మిగులులో కొంతభాగాన్ని సీనియర్‌, జూనియర్‌ క్రికెటర్లకు పంచి.. పురుష, మహిళా క్రికెటర్ల జీతాలను పెంచాలన్నది సీఏ ఆలోచన. ఇందుకు క్రికెటర్లు ఒప్పుకోవాలంటూ హెచ్చరించింది. అందుకు జూన్ 30 చివరి తేదీగా నిర్ణయించింది. అయితే ఈ కొత్త ప్రతిపాదనకు ఆసీస్ క్రికెటర్లు ససేమేరా అంటున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+