
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ కరోనా బారిన పడ్డాడు. బుధవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో మాక్స్‌వెల్‌కు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ప్రస్తుతం మాక్స్‌వెల్‌ను ఐసోలేషన్‌కు తరలించారు. ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో మాక్స్‌వెల్ చికిత్స తీసుకుంటున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మాక్స్‌వెల్ ఈ లీగ్ సందర్బంగానే వైరస్ బారిన పడ్డాడు. చివరి రెండు మ్యాచ్‌ల్లో మెల్‌బోర్న్ జట్టుకు మాక్స్‌వెల్ నాయకత్వం కూడా వహించాడు. ఆడిలైడ్ జట్టుతో జరిగిన గత మ్యాచ్‌లోనే మాక్స్‌వెల్ కోవిడ్ బారిన పడి ఉంటాడని భావిస్తున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ సోకిన మెల్‌బోర్న్ జట్టులో 13వ వ్యక్తి మాక్స్‌వెల్. ఇప్పటికే ఆ జట్టులోని 8 మంది సహాయక సిబ్బందితోపాటు, నలుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దీంతో వీరంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇంత భారీగా కరోనా కేసులు నమోదవడంతో బిగ్‌బాష్ లీగ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
ఆస్ట్రేలియాలో క్రికెట్‌ను కరోనా మహమ్మారి బెంబేలేత్తిస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా జరగుతున్న యాషెస్ సిరీస్‌లో కూడా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్‌తోపాటు పలువురు సహాయక సిబ్బంది, వారి కుటుంబస్థులకు కూడా వైరస్ సోకింది. అలాగే ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావియస్ హెడ్ కూడా కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం వీరంతా జట్టుకు దూరంగా ఉంటూ ఐసోలేసన్‌లో చికిత్స పొందుతున్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా కెప్టెన్ కూడా పాట్ కమిన్స్ కూడా కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినందున రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో యాషెస్ సిరీస్‌లో, బిగ్‌బాష్ లీగ్‌లో కఠిన కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నారు. కరోనా విజృంభణతో యాషెస్ సిరీస్ కూడా మధ్యలోనే ఆగిపోవాల్సిన ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు.
ఇండియాలో కూడా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో క్రికెట్‌పై వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. రంజీ టోర్మమెంట్‌కు సిద్దమవుతున్న 8 మంది వైరస్ బారిన పడ్డారు. ఇందులో బెంగాల్‌కు చెందిన వారే ఏడుగురు ఉన్నారు. ఇందులో ఆరుగురు ఆటగాళ్లు, ఒక సహాయక సిబ్బంది ఉన్నారు. అలాగే ముంబై జట్టుకు చెందిన ఆల్‌రౌండర్ శివమ్ దూబే కూడా కరోనా బారిన పడ్డాడు. క్యాబ్ చైర్మన్‌కు కూడా కరోనా సోకింది. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో రంజీ ట్రోఫీని బీసీసీఐ వాయిదా వేసింది. రంజీ ట్రోఫితోపాటు కల్నల్ సీకే నాయుడు ట్రోఫి, సీనియర్ మహిళల టీ20 లీగ్ కూడా వాయిదా పడ్డ జాబితాలో ఉన్నాయి.