Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీసేన చేతిలో ఓటమి: లంకతో టెస్టు సిరిస్‌కు ఆసీస్ జట్టులో భారీ మార్పులు

Australia Pick Will Pucovski In Test Squad To Face Sri Lanka | Oneindia Telugu
 Australia pick Will Pucovski in Test squad to face Sri Lanka; Shaun and Mitch Marsh dropped

హైదరాబాద్: టీమిండియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఓటమిపాలైన ఆస్ట్రేలియా తన తదుపరి టెస్టు సిరిస్ కోసం జట్టులో భారీ మార్పులు చేసింది. భారత జట్టుతో వన్డే సిరిస్ ముగిసిన తర్వాత శ్రీలంకతో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం ఆసీస్ సెలక్టర్లు జ‌ట్టును ప్ర‌క‌టించారు.

కోహ్లీసేనతో జరిగిన టెస్టు సిరిస్‌లో ఘోరంగా విఫలమైన ఓపెనర్ ఆరోన్ ఫించ్, పీట‌ర్ హ్యాండ్స్‌‌కోంబ్‌ను తప్పించి వీరి స్థానంలో మ్యాట్ రెన్‌షా, జో బ‌ర్న్స్‌ను ఎంపిక చేశారు. ఇక, భారత పర్యటనలో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేసిన షాన్ మార్ష్‌ను కూడా టెస్టు జ‌ట్టు నుంచి త‌ప్పించారు.

మరోవైపు వైస్ కెప్టెన్ మిచెల్ మార్ష్‌ను కూడా శ్రీలంక‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం విశేషం. శ్రీలంక పర్యటనకు కొత్తగా ఆసీస్ సెలక్టర్లు విక్టోరియాకు చెందిన ఓ యువ‌ బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేశారు. కేవ‌లం 8 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన‌ 20 ఏళ్ల విల్ పుకోవ‌స్కీకి జ‌ట్టులో స్థానం క‌ల్పించారు.

ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో విక్టోరియా త‌ర‌పున విల్ పుకోవ‌స్కీ గ‌త సీజ‌న్‌లో 243 పరుగులు చేశాడు. జనవరి 24వ తేదీ నుంచి శ్రీలంక‌తో ఆస్ట్రేలియా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. లంకతో టెస్టు సిరిస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా భారీ మార్పులు చేపట్టడంతో నెటిజన్ల స్పందన ఇలా ఉంది.

శ్రీలంకతో టెస్టు సిరిస్‌కు ఆస్ట్రేలియా జట్టు:
మార్కస్ హారిస్, మ్యాట్ రెన్‌షా, జో బ‌ర్న్స్‌, ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుఛాంగ్నే, టిమ్ పైన్(కెప్టెన్), ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ మార్ష్, నాథన్ లియాన్, జోహ్ హెజెల్ ఉడ్, పీటర్ సిడ్డిల్

Story first published: Thursday, January 10, 2019, 12:26 [IST]
Other articles published on Jan 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+