
ఈ షెడ్యూల్ నావల్ల కాదు..
తీరిక లేని షెడ్యూల్‌పై డేవిడ్ వార్నర్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ షెడ్యూలతో మూడు ఫార్మాట్లు ఆడటం తనవల్ల కాదని తెలిపాడు. ‘అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో వరల్డ్‌కప్ టోర్నీలు వరుసగా ఉన్నాయి. బహుశా మరి కొన్ని సంవత్సరాలల్లో ఈ ఫార్మాట్ నుంచి నేను తప్పుకోవచ్చు. తీరిక లేని ఈ షెడ్యూల్‌ను చూసిన తరువా నాకు మూడు ఫార్మాట్లు ఆడటం చాలా కష్టమనిపించింది. కానీ ఆడాలనుకుంటున్న కుర్రాళ్లలందరికీ గుడ్ లక్. మీరంతా చాలా కాలం అద్భుతంగా ఆడిన ఏబీ డివిలియర్స్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో మాట్లాడండి.'అని వార్నర్ సూచించాడు.
రికార్డుల రారాజు కోహ్లీకి ఏమైంది? 6 నెలలుగా ఒక్క సెంచరీ లేదు..?

దేశాలు పట్టుకోని తిరగడం బాలేదు..
తన ముగ్గురు పిల్లలను, భార్యను వదిలేసి క్రికెట్ కోసం దేశాలు పట్టుకోని తిరగడం కష్టంగా ఉందని వార్నర్ చెప్పుకొచ్చాడు. ‘ఇంట్లో ముగ్గురు చిన్న పిల్లలు, నా భార్యను ఒంటిరిగా వదిలేసి నిరంతరం ప్రయాణించడం చాలా కష్టంగా ఉంది. అందుకే ఒక ఫార్మాట్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా. అది మాత్రం అది టీ20లే కావచ్చు.'అని వార్నర్ చెప్పుకొచ్చాడు.
ఈ వీడియో ఏంది ఇవాళ ఇన్నిసార్లు రీట్వీట్ అవుతుంది.. డేవిడ్ వార్నర్‌పై బ్రాడ్ సెటైర్స్

అందుకే బీబీఎల్ ఆడలేదు..
ఇంటర్నేషనల్ కెరీర్‌పై దృష్టిపెట్టాలనే బీబీఎల్ స్కిప్ చేసినట్లు వార్నర్ స్పష్టం చేశాడు. ‘నాకు బీబీఎల్ జట్టు లేదు. బీబీఎల్ జరుగుతున్నంత కాలం నేను విశ్రాంతి తీసుకోవాలనుకున్నాను. శారీరకంగా, మానసికంగా తదుపరి సిరీస్ కోసం సిద్ధం కావాలని బీబీఎల్ ఆడలేదు.'అని ఈ ఆసీస్ ఓపెనర్ తెలిపాడు. ఆస్ట్రేలియా తరఫున 76 అంతర్జాతీయ టీ20లు ఆడిన వార్నర్ ఒక సెంచరీ, 15 హాఫ్ సెంచరీలతో 2079 పరుగులు చేశాడు.

అత్యుత్తమ క్రికెటర్‌గా..
ఆస్ట్రేలియా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును డేవిడ్ వార్నర్ దక్కించుకున్న విషయం తెలిసిందే. 2020 అవార్డుల కోసం నిర్వహించిన ఓటింగ్‌లో స్టీవ్ స్మిత్ (193 ఓట్లు)ను వార్నర్ ఒక్క ఓటు తేడాతో ఓడించి అలెన్ బోర్డర్ మెడల్‌ను మూడోసారి దక్కించుకున్నాడు. పురుషుల టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా వార్నర్ సొంతం చేసుకున్నాడు. పురుషుల వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఆరోన్ ఫించ్, టెస్ట్ ప్లేయర్‌గా లబుషేన్ ఎంపికయ్యారు. బెస్ట్ ఫిమేల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలి చిన ఎలీస్ పెర్రీకి బెలిండా క్లార్క్ మెడల్ లభించింది.