Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రాడ్ దెబ్బకు ఆసీస్ విలవిల: 60 పరుగులకే ఆలౌట్

లండన్: యాషెస్‌ టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌లో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఘోరంగా విఫలమవుతోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను ఇంగ్లాండ్ బౌలర్లు కోలుకోలేని దెబ్బ తీశాడు. స్టువర్ట్ బ్రాడ్ సంచలన బౌలింగ్‌తో ఆసీస్ తోక ముడిచేసింది.

స్టువర్ట్‌ బ్రాడ్‌ కేవలం 11 బంతుల వ్యవధిలోనే 5 వికెట్లు తీసి ఆస్ట్రేలియా నడ్డి విరిచాడు. మొత్తం 15 పరుగులిచ్చిన బ్రాడ్.. 8 వికెట్లను కూల్చాడు. మార్క్‌ వుడ్‌, స్వీవెన్‌ ఫిన్‌ తలో వికెట్‌ తీశారు.

Australia obliterated by England in devastating Ashes spell of SEVEN wickets in just 56 balls

రోజర్స్‌(0), వార్నర్‌(0), స్మిత్‌(6), మార్ష్(0), క్లార్క్‌(10), వోగ్స్‌(1) నెవిల్‌(1) ఘోరంగా విఫలమయ్యారు. ఆ తర్వాత కూడా స్టువర్ట్ బ్రాడ్ ఆస్ట్రేలియా ఆటగాళ్లను వదిలిపెట్టలేదు. జాన్సన్ (13), స్టార్క్ (1)లను కూడా పెవిలియన్ చేర్చాడు.

ఏడు ఓవర్లలో మూడు మేడిన్లతో సహా 15 పరుగులు మాత్రమే ఇచ్చిన బ్రాడ్ 8 కీలక వికెట్లు తసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. 18.3 ఓవర్లలో 60 పరుగులు చేసిన ఆసీస్ ఆలౌటైంది.

కాగా, ఇప్పటికే ఇంగ్లాండ్ 2-1 తేడాతో ముందంజలో ఉంది. ఈ మ్యాచులో ఆసీస్‌కు ఓటమి ఎదురైతే మాత్రం మరో టెస్ట్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోవాల్సి వస్తుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+