Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌తో వన్డేలకు ఆసీస్ జట్టు ఎంపిక: వాట్సన్‌కు దక్కని చోటు

మెల్‌బోర్న్: భారత్‌తో జరగనున్న వన్డే సిరిస్‌కు ఆస్టేలియా జట్టు 13 మందితో కూడిన జట్టుని సోమవారం ప్రకటించింది. జనవరి 12న పెర్త్‌లో జరగనున్న మ్యాచ్‌తో ప్రారంభం కానున్న ఈ సిరిస్‌కు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్వవహారించనున్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా మొదటి మూడు వన్డేల్లో ఈ జట్టు తలపడనుంది.

ఫాస్ట్ బౌలర్లు జోల్ పారిస్, స్కాట్ బోలాండ్‌లకు జట్టులో చోటు లభించింది. కాగా, ఆస్టేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్‌కు జట్టులో చోటు దక్కక పోవడం విశేషం. గాయం కారణంగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ జట్టులో స్థానం కోల్పోయాడు. 26 ఏళ్ల బోలాండ్, 23 ఏళ్ల పారిస్ జాతీయ జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్నారు.

Australia name squad for India ODIs; Shane Watson dropped

జనవరి 8న నుంచి ఆసీస్ జట్టు పెర్త్‌లో ప్రాక్టీస్ మొదలు పెడుతుందని జాతీయ సెలక్టర్ రాడ్ మార్ష్ తెలిపారు. భారత్, ఆస్టేలియాలు 5 వన్డేలు, 3 ట్వంటీ20లు ఆడతాయి. వరల్డ్ కప్ 2015 సెమీ ఫైనల్ తర్వాత ఇరు జట్లు జనవరి 12న పెర్త్‌లో జరగనున్న వన్డే మ్యాచ్‌తో తలపడనున్నాయి.

భారత్‌తో తొలి 3 వన్డేలకు ఆసీస్ జట్టు ఎంపిక:

స్టీవ్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్ (వైస్ కెప్టెన్), జార్జ్ బెయిలీ, స్కాట్ బోలాండ్, జోష్ హాజల్‌‌ఉడ్, జేమ్స్ ఫాల్క్నర్, ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్, షాన్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, జోయెల్ పారిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్).

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+