For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాక్స్‌వెల్, ఖవాజా రీఎంట్రీ.. ఇంగ్లండ్ టూర్‌కి ఆస్ట్రేలియా జట్టు ఇదే!!

Australia name 26-man preliminary squad for England tour

సిడ్నీ: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత నాలుగు నెలలుగా క్రికెట్ నిలిచిపోయింది. వైరస్ నేపథ్యంలో ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బయో సెక్యూర్‌ వాతావరణం సృష్టించి అంతర్జాతీయ క్రికెట్ ఆరంభించింది. బయో సెక్యూర్‌ వాతావరణంలో ఇప్పటికే ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు అంతర్జాతీయ మ్యాచ్ ఆడాయి. ఆగస్టు 5 నుంచి పాకిస్థాన్ కూడా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

బయో సెక్యూర్‌ వాతావరణంలో ఒక టెస్ట్ విజయవంతం అవ్వడంతో.. క్రికెట్ ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమైంది. ఇందుకోసం 26 మందితో కూడిన ప్రాథమిక ఆస్ట్రేలియా జట్టుని తాజాగా ప్రకటించింది. సెప్టెంబరు 1న ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ పర్యటన ముగియనుండగా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే, టీ20 సిరీస్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. త్వరలో తేదీలు ప్రకటించే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియా మ్యాచ్‌లను కూడా పూర్తి బయో సెక్యూర్‌ వాతావరణంలో నిర్వహించాలని ఈసీబీ యోచిస్తుండటంతో.. కనీసం నెల రోజుల ముందు టీమ్‌ని క్రికెట్ ఆస్ట్రేలియా అక్కడికి పంపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ప్రాథమిక జట్టుని సీఏ ప్రకటించింది. క్వారంటైన్‌లో ఉన్న అనంతరం ఆసీస్ ఆటగాళ్లకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత జట్టును పంపనున్నారు. ఇంగ్లండ్ గడ్డపై అడుపెట్టిన అనంతరం కూడా ఆసీస్ ప్లేయర్స్ క్వారంటైన్‌లో ఉండాలి. ఆపై నెగటివ్ వస్తే.. ప్రాక్టీస్ చేసి సిరీస్ ఆడుతారు.

వన్డే, టీ20 సిరీస్ కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో ఉస్మాన్ ఖవాజా, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్, ఆండ్రూ టైలు రీఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాష్ లీగ్‌లో అదరగొట్టిన జోష్ ఫిలిప్ మరియు డేనియల్ సామ్స్ కూడా ఎంపికయ్యారు. పీటర్ హ్యాండ్కొంబ్‌, షాన్ మార్ష్, నాథన్ కౌల్టర్-నైల్‌లకు నిరాశే ఎదురైంది.

ఆస్ట్రేలియా జట్టు:
అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్‌ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, ఆండ్రూ టై, మాథ్యూ వెడ్, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్, డీఆర్క్‌ షాట్, సీన్ అబాట్, అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్కస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ మెక్‌డెర్మాట్, రిలే మెరెడిత్, మైకేల్ నేసర్, జోష్ ఫిలిప్, డేనియల్ సామ్స్.

Story first published: Thursday, July 16, 2020, 18:39 [IST]
Other articles published on Jul 16, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+