For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Australia Semifinal: అయ్యో.. ఆసీస్‌కు భారీ ఎదురుదెబ్బ - సెమీస్ ఆనందం కాసేపు కూడా లేదే!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సెమీఫైనల్ కు దూసుకెళ్లిన అగ్రజట్టు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఆ జట్టులోని ఓ కీలక ప్లేయర్ సెమీస్ కు దూరమయ్యా సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అతడికి తీవ్ర గాయమైందని తెలుస్తోంది. ఇంతకీ అతడెవరంటే?

ఆడేది అనుమానమే..
ఆస్ట్రేలియా తాజాగా లాహోర్ వేదికగా అప్ఘానిస్థాన్ తో కీలక మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ తర్వాత కాసేపు జరిగి అనంతరం వర్షం కారణంగా రద్దైంది. అయితే ఈ కొంత సేపు జరిగిన ఆటలో ఆసీస్ ప్లేయర్ మ్యాథ్యూ షార్ట్ గాయపడ్డాడు. దీంతో అతడు ఇప్పుడు మార్చి 4న జరగబోయే సెమీ ఫైనల్ లో ఆడతాడా లేడా అనేది అనుమానంగా మారింది.

Australia Matthew Short is likely ruled out of Champions Trophy 2025 semifinal due to injury

మ్యాథ్యూ షార్ట్ గాయం తీవ్రతపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. అతడు కోలుకోవడానికి కొంత సమయం పట్టొచ్చని అన్నాడు. "అతడికి గాయం తగలడం వల్ల కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అతడు కోలుకోవడానికి కొద్ది రోజుల సమయం పడుతుంది" అని స్మిత్ చెప్పుకొచ్చాడు.

రీప్లేస్‌మెంట్ అతడే
అప్ఘానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో మ్యాథ్యూ ప్రభావంతమైన ఇన్నింగ్సే ఆడాడు. 15 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన రెండు మ్యాచుల్లో అతడు 102 స్ట్రైక్ రేట్ తో 83 పరుగులు చేశాడు. కాగా, మ్యాథ్యూ రీప్లేస్ మెంట్ గా ఎవరు వచ్చి ఆడతారనేది క్లారిటీ లేదు. అతడి స్థానంలోకి జేక్ ఫ్రేజర్ - మెక్ గుర్క్ ఆడొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

Story first published: Saturday, March 1, 2025, 10:09 [IST]
Other articles published on Mar 1, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+