క్రికెట్‌లో అద్భుతం: ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం
హైదరాబాద్: రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఢాకా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 20 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను బంగ్లాదేశ్ చిత్తు చేసింది. ఆల్‌రౌండర్ షకీబ్ ఉల్ హసన్ ఈ మ్యాచ్‌లో పది వికెట్లు తీసి బంగ్లాదేశ్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన షకీబ్ ఆస్ట్రేలియాకు షాకిచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 260 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 217 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 221 పరుగులు చేయడంతో ఆసీస్‌కు 265 పరుగులు విజయ లక్ష్యంగా నిర్దేశించింది.

రెండో ఇన్నింగ్స్‌లో 265 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 244 పరుగులకే ఆలౌటైంది. 109/2 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 136 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ వార్నర్ (112) మెరుపు సెంచరీ చేసినా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.
చివరి 7 వికెట్లను కేవలం 73 పరుగుల తేడాలో కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 2 వికెట్లకు 109 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా ఒకానొక దశలో గెలిచేలా కనిపించినప్పటికీ చివరికి ఓటమి తప్పలేదు. 101 టెస్టులు ఆడిన బంగ్లాకు ఇది 10వ విజయం కావడం గమనార్హం.
ఇక ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విజయం. గతేడాది ఇంగ్లండ్ పై కూడా బంగ్లాదేశ్ విజయం సాధించింది. కాగా, టెస్టు క్రికెట్‌లో రెండు రోజుల్లో రెండు సంచలన విజయాలు నమోదయ్యాయి. షాయ్ హోప్ (118 నాటౌట్) అద్భుత సెంచరీతో పాటు బ్రాత్ వైట్ (95) పోరాటంతో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో వెస్టిండిస్ చారిత్రక విజయాన్ని సాధించింది.
ఇప్పుడు ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యం సంపాదించింది.
తొలి ఇన్నింగ్స్:
బంగ్లాదేశ్: 260 ఆలౌట్
ఆస్ట్రేలియా: 217 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్:
బంగ్లాదేశ్: 221 ఆలౌట్
ఆస్ట్రేలియా: 244 ఆలౌట్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications