For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup final: జ్యోతిష్యుల అవతారం ఎత్తిన మాజీలు: అంచనాలన్నీ ఆ టీమ్‌పైనే

Australia is favourites to win T20 World Cup 2021 Final against New Zealand, says Gavaskar

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ 2021 టోర్నమెంట్ టైటిల్ విజేత ఎవరో ఇవ్వాళ తేలిపోతుంది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7:30 గంటలకు ఆరంభం కానుంది. 7 గంటలకు టాస్ పడుతుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మారింది. కేన్ విలియమ్సన్ సారథ్యంలో న్యూజిలాండ్.. ఆస్ట్రేలియాను ఢీ కొట్టబోతోంది. 2019 ప్రపంచకప్ ఫైనల్‌లో అనూహ్యంగా ఓడిపోయిన బ్లాక్ క్యాప్స్.. ఆ లోటును భర్తీ చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.

గ్రూప్స్‌ దశలో ఓడినా..

గ్రూప్స్‌ దశలో ఓడినా..

సూపర్ 12 దశలో ఈ రెండు జట్లు సమవుజ్జీలతో ఓడిపోయినప్పటికీ.. ఆ తరువాత బౌన్స్ బ్యాక్ అయ్యాయి. గ్రూప్స్‌లో తాను ఎదుర్కొన్న తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ ఓడిపోయింది. పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా కూడా ఇంగ్లండ్ చేతిను గెలవలేకపోయింది ఆ తరువాతి మ్యాచ్‌లల్లో ఈ రెండు జట్లు కూడా దుమ్ము లేపాయి. సెమీ ఫైనల్స్‌లో పాకిస్తాన్‌ను ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ ఓడించాయి. ఫైనల్స్‌లో అడుగు పెట్టాయి. ఈ రెండు జట్లు అన్ని రంగాల్లోనూ సమవుజ్జీలుగా ఉన్నాయి. టైటిల్ ఫేవరేట్ ఎవరో తేల్చుకోవడం కష్టమే.

మాజీల అంచనాలు ఎలా ఉన్నాయి..

మాజీల అంచనాలు ఎలా ఉన్నాయి..

టీ20 ప్రపంచకప్ 2021 విన్నర్ ఎవరనే అంచనాలను వెలువడుతున్నాయి. మెజారిటీ మాజీ క్రికెటర్లు.. ఆస్ట్రేలియా వైపు మొగ్గు చూపిస్తున్నారు. భారత్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఇలా.. వేర్వేరు దేశాలకు చెందిన తలపండిన మాజీ క్రికెటర్లందరూ కంగారూ టీమ్ గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు. ఆసీస్‌తో పోల్చుకుంటే.. కివీస్‌కు ఒకట్రెండు బలహీనతలు ఉన్నాయని, అవి ఆ జట్టు ఓడిపోవడానికి దారి తీయొచ్చని అంటున్నారు.

నా ఫేవరెట్.. ఆస్ట్రేలియా

నా ఫేవరెట్.. ఆస్ట్రేలియా

టీమిండియా లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్.. ఆస్ట్రేలియా గెలుస్తుందని అంచనా వేశారు. టైటిల్ విన్నర్‌గా ఆసీస్ నిలుస్తుందని స్పష్టం చేశాడు. బౌలింగ్‌లో ఉన్న చిన్న లోపాలను సరిచేసుకుంటే ఆ జట్టుకు తిరుగు ఉండది తేల్చి చెప్పారు. న్యూజిలాండ్ జట్టులో నిలకడ లోపించిందని, ఒకరిద్దరు బ్యాటర్ల పైనే ఆధార పడాల్సి వస్తోందని విశ్లేషించారు. అలాగని బ్లాక్ క్యాప్స్‌ను ఏ మాత్రం తీసేయడానికి వీల్లేదని అన్నారు. గ్రూప్స్ దశలో ఈ రెండు జట్లు అద్భుతంగా ఆడాయని కితాబిచ్చారు. ఒత్తిడిని జయించే సామర్థ్యం న్యూజిలాండ్ కంటే ఆస్ట్రేలియన్లకే అధికంగా ఉందని వ్యాఖ్యానించారు.

సెమీస్ తరువాత మరింత రాటుదేలింది..

సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అసలు సత్తా ఏమిటో బయటపడిందని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ అన్నారు. ఆ జట్టుకే ఫైనల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. స్టీవెన్ స్మిత్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నప్పటికీ.. ఓపెనర్లు, మిడిల్, లోయర్ ఆర్డర్ బలంగా ఉందని పేర్కొన్నాడు. డేవిడ్ వార్నర్ తన మునుపటి ఫామ్‌, రిథమ్‌ను అందుకున్నాడని చెప్పాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్.. కఠిన పరిస్థితుల్లో రాణించగలరని చెప్పాడు. దుబాయ్ స్టేడియంలో టాస్ గెలిచిన జట్టు మ్యాచ్‌లోనూ విజయం సాధించడానికి 80 నుంచి 90 శాతం మేర అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

షేన్ వార్న్ సైతం..

షేన్ వార్న్ సైతం..

ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ సైతం తన దేశ జట్టు వైపే నిలిచాడు. న్యూజిలాండ్‌తో పోల్చుకుంటే ఆస్ట్రేలియాలో దూకుడు వైఖరి కనిపిస్తోందని, ఫైనల్ గెలవడానికి అది చాలా అవసరమని అన్నాడు. ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఉండొచ్చని తాను అంచనా వేశానని, ఈ రెండు జట్లపైనా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా గెలిచిన విధానం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాడు. ఫైనల్ మ్యాచ్ విన్నర్ ఎవరో ప్రిడిక్ట్ చేస్తూ.. ఓ వీడియోను ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఈ సారి ఆస్ట్రేలియా టీ20 ఫార్మట్ క్రికెట్ ఛాంపియన్‌గా ఆవిర్భవిస్తుందని చెప్పాడు.

Story first published: Sunday, November 14, 2021, 8:29 [IST]
Other articles published on Nov 14, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+