Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెమీపైనల్లో ఓటమెరుగని ఆస్ట్రేలియా: చరిత్ర సృష్టించేదెవరో!

Australia have never lost a semi-final in World Cup; Are England listening?


హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఎడ్జిబాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఆదివారం(జులై 14)న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగనున్న పైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుండగా... ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

7 సార్లు సెమీస్‌‌లో నెగ్గిన ఆస్ట్రేలియా

7 సార్లు సెమీస్‌‌లో నెగ్గిన ఆస్ట్రేలియా

కాగా, 1975 నుంచి 2015 వరకు జరిగిన ప్రపంచకప్ సెమీపైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఇప్పటివరకు 7 సార్లు ఆస్ట్రేలియా సెమీపైనల్‌కు చేరగా అన్ని సార్లూ ఆస్ట్రేలియానే విజయం వరించింది. ఇక, 7 ప్రపంచకప్ ఫైనల్స్ ఆడిన ఆస్ట్రేలియా ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలవగా... రెండు సార్లు ఓడిపోయింది.

తొలిసారి ఇంగ్లాండ్‌పై విజయం

తొలిసారి ఇంగ్లాండ్‌పై విజయం

ఆస్ట్రేలియా జట్టు మాదిరే పుట్‌బాల్ ప్రపంచకప్‌లో బ్రెజిల్ సైతం ఏడు సార్లు ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఇందులో బ్రెజిల్ కూడా ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలవగా... రెండు సార్లు ఓడిపోయింది. ఈ రెండు జట్లూ పసుపు రంగు జెర్సీలనే ధరించడం విశేషం. 1975 ప్రపంచకప్‌లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.

1987లో రెండోసారి

1987లో రెండోసారి

ఆ తర్వాత మళ్లీ 12 ఏళ్లకు 1987లో ఆస్ట్రేలియా రెండోసారి సెమీఫైనల్‌కు చేరింది. అలెన్ బోర్డర్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం 1996లో మొహాలి వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.

1999 ఎడిషన్‌లో స్టీవ్ వా నేతృత్వంలోని

1999 ఎడిషన్‌లో స్టీవ్ వా నేతృత్వంలోని

ఆ తర్వాత 1999 ఎడిషన్‌లో స్టీవ్ వా నేతృత్వంలోని ఆస్ట్రేలియా ఒక పరుగు తేడాతో ఉత్కంఠ భరిత విజయాన్ని నమోదు చేసింది. ఇక, 2003లో రికీ పాంటింగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో శ్రీలంకపై 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2007లో మళ్లీ ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి.

2015లో టీమిండియాపై

2015లో టీమిండియాపై

ఆస్ట్రేలియాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లో శ్రీలంకపై అలవోక విజయాన్ని నమోదు చేసి నాలుగోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఇక, స్వదేశంలో జరిగిన 2015 ప్రపంచకప్‌లో టీమిండియాపై 95 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా.... ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి ఐదోసారి వరల్డ్‌కఫ్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది.

Story first published: Thursday, July 11, 2019, 15:50 [IST]
Other articles published on Jul 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+