Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిగ్గుగా అనిపిస్తోంది: బాల్ టాంపరింగ్‌‌పై ఎవరేమన్నారు?

Australia Ball Tampering : Reactions And Trolls
Australia guilty of ball-tampering: Who said what

హైదరాబాద్: కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియన్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ బాల్ టాంపరింగ్ వ్వవహారం ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలోనే ఇదొక మాయని మచ్చగా మిగిలింది. అంతేకాదు ఈ బాగోతం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసింది.

గెలుపు కోసం క్రీడా స్ఫూర్తిని మంటగలుపుతూ ఆస్ట్రేలియా క్రికెటర్లు బరితెగించిన వైనంపై ఆ దేశ ప్రధాని, మాజీ క్రికెటర్లతో పాటు అందరూ మండిపడుతున్నారు. బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆస్ట్రేలియాను క్రికెట్‌ మాజీలు మండిపడుతున్నారు. పక్కా ప్రణాళికతో మోసానికి పాల్పడడం సిగ్గు చేటన్నారు.


అలెన్‌ బోర్డర్‌
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌ మాట్లాడుతూ 'ఆసీస్‌ జట్టు చర్య తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. సిగ్గుగా కూడా అనిపిస్తోంది' అని అన్నాడు.


షేన్‌ వార్న్‌
బాల్ టాంపరింగ్‌కు పాల్పడడం ఆస్ట్రేలియా నైజానికి విరుద్ధమని దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ అన్నాడు. ఈ సందర్భంగా వార్న్ మాట్లాడుతూ 'బాన్‌క్రాఫ్ట్‌పై జాలేస్తుంది. ఇది అతనొక్కడే తీసుకున్న నిర్ణయం కాదు. ఏదో చేయాలని అతడి జేబులో ఏదో పెట్టారు' అని అన్నాడు.


షాన్‌ పొలాక్‌
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ షాన్‌ పొలాక్‌ మాట్లాడుతూ 'ఆస్ట్రేలియా పక్కా ప్రణాళిక ప్రకారమే టాంపరింగ్‌కు పాల్పడింది. మోసానికి పాల్పడుతూ దొరికిపోయింది. తమ చర్యలకు వాళ్లు పర్యవసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది' అని అన్నాడు.


ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్‌ టర్న్‌బల్‌
బాల్ టాంపరింగ్ వివాదంపై ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్‌ టర్న్‌బల్‌ మాట్లాడుతూ 'ఈ దేశమంతా మిమ్మల్ని గొప్పగా చూస్తుంది. రాజకీయ నాయకుల కంటే కూడా మిమ్మల్ని ఎక్కువగా గౌరవిస్తుంది. కానీ మీ చర్య దిగ్భ్రాంతిని, నిరాశను కలిగించింది. ఆస్ట్రేలియా జట్టు ఇలా మోసం చేసిందంటే నమ్ములేకపోతున్నా. మీరు చేసింది తప్పు. క్రికెట్‌ ఆస్ట్రేలియా కఠిన నిర్ణయం తీసుకుంటుందని నమ్ముతున్నా' అని అన్నాడు.


మైకేల్ క్లార్క్
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ 'మైదానంలో తమ సహచర ఆటగాళ్లు చేసింది క్షమించరాని తప్పుగా అభివర్ణించాడు. అదేవిధంగా స్టీవ్‌ స్మిత్‌కు, సహచర ఆటగాళ్లకు తన తరఫున పూర్తి సానుభూతి ప్రకటిస్తున్నా. స్టీవ్‌ స్మిత్‌ చేసింది చాలా పెద్ద తప్పు అని నా మనస్సు తలుస్తోంది. కానీ ఈ సమస్యకు ఏదో ఒక మార్గం ఉంటుంది. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌ తిరిగి కొనసాగుతాడా? దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న సంగతి గుర్తురెగాలి. అవసరమొస్తే జట్టుకు తిరిగి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నా' అని అన్నాడు.


మైకెల్ వాన్
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ మాట్లాడుతూ 'ఒక అంతర్జాతీయ కెప్టెన్ మోసం చేశానని అంగీకరించినా అతడిపై ఒక్క మ్యాచ్ నిషేధంతో సరిపెట్టుతారా? బాన్‌క్రాఫ్ట్‌కు 75 శాతం మ్యాచ్ ఫీజు కోత సరిపోతుందా? మోసం చేసినందుకు తీవ్రమైన శిక్షలు విధించాలి. వైస్ట్ కెప్టెన్‌తో సహా నాయకత్వ సమూహంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమేమిటి? ఐసీసీలో చాలా మార్పు రావాలి' అని మైకెల్ వాన్ అన్నాడు.


నాసిర్‌ హుస్సేన్‌
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ 'మోసం చేయాలని ముందస్తుగానే వేసుకున్న ప్రణాళిక ఇది' అని అన్నాడు.


కెవిన్ పీటర్సన్
ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ 'కోచ్‌గా లీమన్‌ కెరీర్‌లో ఎంతో గొప్ప టెస్టు. ఇది బాన్‌క్రాఫ్ట్‌ ఒక్కడి ఐడియానే అని నమ్మడానికి నా మనసైతే అంగీకరించడం లేదు' అని అన్నాడు.


బిషన్‌సింగ్‌ బేడీ
భారత మాజీ అటగాడు బిషన్‌సింగ్‌ బేడీ మాట్లాడుతూ 'తప్పిదం జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు ఆటగాళ్లే కారణం. కెప్టెన్‌ తన తప్పును అంగీకరించాడు. ఒకరిద్దరు ప్లేయర్ల కారణంగా జరిగినదైతే కాదు' అని అన్నాడు.


హర్భజన్‌సింగ్
టీమిండియా వెటనర్ క్రికెటర్ హర్భజన్‌సింగ్ మాట్లాడుతూ 'ఆహా ఐసీసీ! ఎంత గొప్ప తీర్పో? బాల్ టాంపరింగ్ వివాదంలో మీ నిర్ణయం పూర్తిగా వివక్ష పూరితం. అన్ని ఆధారాలు ఉన్నా బాన్‌క్రాఫ్ట్‌పై ఎలాంటి సస్పెన్షన్ లేదు. 2001లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అతిగా అప్పీల్ చేసినందుకు సచిన్, సౌరవ్, శివసుందర్, దీప్‌దాస్ గుప్తా, సెహ్వాగ్‌పై ఒక్కో టెస్ట్ సస్పెన్షన్ వేశారు. 2008 సిడ్నీ టెస్టు సందర్భంగా నా తప్పేమీ లేకున్నా 3 మ్యాచ్‌లు నిషేధించారు. కానీ అన్ని సాక్ష్యాలున్నా బాన్‌క్రాఫ్ట్‌పై నిషేధం లేదు. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు శిక్షలా. ఆస్ట్రేలియా జట్టు మొత్తాన్ని శిక్షించాలి' అని అన్నాడు.


ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్‌
ఈ ఘటనను తీవ్రమైన నేరంగా పరిగణించి స్మిత్‌పై శిక్ష విధించినట్టు ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ తెలిపాడు. 'మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాయకత్వ బృందం చేసిన పని క్రికెట్‌ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. కెప్టెన్‌ స్మిత్‌ దీనికి పూర్తి బాధ్యత తనదే అని చెప్పడంతో అతనిపై సస్పెన్షన్‌ వేటు వేశాం' అని రిచర్డ్‌సన్‌ పేర్కొన్నాడు. బాన్‌క్రా‌ఫ్ట్‌ కూడా తప్పు ఒప్పుకోవడంతో విచారణ అవసరం లేకుండా చర్యలు తీసుకున్నామన్నాడు.


క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)
బ్యాల్‌ ట్యాంపరింగ్‌కు నేృతృత్వం వహించిన స్మిత్‌ జట్టు కెప్టెన్‌గా కొనసాగుతాడని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తెలిపింది. ఈ ఘటన తెలిసి షాక్‌ గురయ్యానని, ఆటగాళ్ల పని చూసి చాలా నిరుత్సాహపడ్డానని సీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జేమ్స్‌ సదర్లాండ్‌ పేర్కొన్నారు. 'ప్రస్తుతానికి ఆసీస్‌ కెప్టెన్‌గా స్మిత్‌ ఉంటాడు. అయితే, ఈ ఉదంతానికి కారకులైన వారిపై కఠినచర్యలు తీసుకుంటాం. సమగ్ర దర్యాప్తు కోసం ఇప్పటికే అత్యున్నత స్థాయి అధికారుల బృందాన్ని దక్షిణాఫ్రికా పంపించాం. పూర్తి వివరాలు అందిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామ'ని సదర్లాండ్‌ వివరించారు.


ఈ సిగ్గుమాలిన చర్యను ప్రోత్సహించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ఒక టెస్టు మ్యాచ్ నిషేధంతో పాటు మ్యాచ్‌ ఫీజులో వంద శాతం కోత విధించారు. మరోవైపు బాల్ టాంపరింగ్ పాత్రధాని బాన్‌క్రాఫ్ట్‌పై 75 శాతం జరిమానా, మూడు డీమెరిట్‌ పాయింట్లను అతడి ఖాతాలో జత చేశారు. బాల్‌ టాంపరింగ్‌‌కు ప్రోత్సహించిన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, వైస్ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌లను క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఆ బాధ్యతల నుంచి తప్పించింది. నాలుగో రోజు ఆటలో టిమ్ పెయినీ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

Story first published: Monday, March 26, 2018, 11:05 [IST]
Other articles published on Mar 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+