పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. వర్షం కారణంగా మొదటి రోజు ఆట 66 ఓవర్లు మాత్రమే సాగింది. క్రీజులో లబుషేన్ (44*), ట్రావిస్ హెడ్ (9*) ఉన్నారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, ఆమర్ జమాల్, సాల్మన్ తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. డేవిడ్ వార్నర్ (38), ఉస్మాన్ ఖవాజా (42) తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించారు.బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించిన పిచ్‌పై జాగ్రత్తగా ఆడుతూ పరుగులు సాధించారు. అయితే అర్ధశతకాలకు చేరువవుతున్న వారిద్దరిని పాక్ బౌలర్లు పెవిలియన్‌కు పంపించారు.

తర్వాత వచ్చిన లబుషేన్.. స్టీవ్ స్మిత్ (26)తో కలిసి స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. అయితే వీరిద్దరు బ్యాటింగ్ చేస్తున్న టైమ్‌లో పావురాల వల్ల ఆట కాసేపు ఆగింది. మైదానంలో పావురాలు వచ్చి ఉండటంతో వాటిని బయటికి పంపించడానికి లబుషేన్ తీవ్రంగా కష్టపడ్డాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
మెల్‌బోర్న్ పిచ్‌పై పరుగుల కోసం కంటే పావురాల కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు కష్టపడుతున్నారని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కాగా, తర్వాత జమాల్ బౌలింగ్‌లో స్మిత్ షాట్‌కు యత్నించి రిజ్వాన్ చేతికి చిక్కాడు. తొలి టెస్టులో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా 360 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.