Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మొహాలీ టెస్టు: ఓటమి అంచున ఆసీస్

Micheal Clark
మొహాలి: మొహాలిలో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా ఓటమికి ఎదురీదుతోంది. భారత్ తన ముందుంచిన 516 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి రెండో ఇన్నింగ్సును మొదలు పెట్టిన ఆస్ట్రేలియా తీవ్రమైన కష్టాల్లో పడింది. ఒకానొక సందర్భంలో 58 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి ఆస్ట్రేలియా పీకల లోతు కష్టాల్లో పడింది. క్లార్క్, హాడిన్ భారత బౌలింగుకు ఎదురీదుతున్నారు. రెండో ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా సోమవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. భారత్ లక్ష్యాన్ని ఛేదించడంలో 375 పరుగులు వెనకబడి పోయింది. ఆట ముగిసే సమయానికి క్లార్క్ 42 పరుగులతోనూ, హాడిన్ 37 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్సులో 46 ఓవర్లు ఆడింది.

ఆస్ట్రేలియా ఓపెనర్లు మాథ్యూ హేడెన్, కాటిచ్ ఇన్నింగ్సును ధాటిగానే ప్రారంభించారు. చకచకా పరుగులు చేసి భారత్ ను భయపెట్టే ప్రయత్నం చేశారు. 20 బంతుల్లో 29 పరుగులు చేసిన హెడెన్ హర్భజన్ బౌలింగులో ఎల్బీడబ్ల్యుగా పెవిలియన్ కు దారి పట్టాడు. కాటిచ్ 26 బంతుల్లో 20 పరుగులు చేసి హర్భజన్ బౌలింగులోనే టెండూల్కర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్సమెన్ నిలదొక్కుకోలేకపోయారు. పాంటింగ్ రెండు పరుగులు మాత్రమే చేసి ఇషాంత్ శర్మ బౌలింగులో అవుటయ్యాడు. వాట్సన్ కూడా 22 బంతులు ఆడి రెండు పరుగులు మాత్రమే చేసి ఇషాంత్ శర్మ చేతిలో అవుటయ్యాడు. హస్సీ ఒక పరుగు మాత్రమే చేసి హర్భజన్ బౌలింగులో ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. హర్భజన్ మూడు వికెట్లు తీసుకోగా, ఇషాంత్ రెండు వికెట్లు తీసుకున్నాడు.
Story first published: Monday, October 20, 2008, 17:27 [IST]
Other articles published on Oct 20, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+