Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 సిరిస్: ఆస్ట్రేలియా జట్టుకు జరిమానా విధించిన ఐసీసీ

Australia fined for maintaining slow-over rate in first T20I against India

హైదరాబాద్: బ్రిస్బేన్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో స్లో ఓవర్‌రేట్ కారణంగా ఆస్ట్రేలియా జట్టుకు ఐసీసీ మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం, జట్టు సభ్యులకు 10 శాతం కోత విధించారు. నిర్ణీత సమయంలో ఆస్ట్రేలియా జట్టు ఒక ఓవర్ తక్కువగా వేయడంతో ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ఈ నిర్ణయం తీసుకున్నారు.

బిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లో

బిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లో

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా బిస్బేన్ వేదికగా గత బుధవారం జరిగిన తొలి టీ20లో ఆసీస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. డక్‌వర్త్ లాయిస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా నిర్దేశించిన 174 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది.

శిఖర్ ధావన్ (76) హాఫ్ సెంచరీతో

శిఖర్ ధావన్ (76) హాఫ్ సెంచరీతో

భారత బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ శిఖర్ ధావన్ (76) హాఫ్ సెంచరీతో చేయగా, చివర్లో దినేష్ కార్తీక్ (13 బంతుల్లో 30) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. భారత్‌ను ఓటమి నుంచి తప్పించలేకపోయారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయానికి ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరమైన సమయంలో పాండ్యా(2), కార్తీక్(30) వరుస బంతుల్లో పెవిలియన్ చేరడం భారత జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది.

మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదింపు

మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదింపు

ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా, స్టోయినిస్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. వరుణుడు అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. దీంతో నిర్ణీత ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టీమిండియా విజయ లక్ష్యాన్ని 174 పరుగులుగా సవరించారు.

1-0 ఆధిక్యంలో ఆస్ట్రేలియా

1-0 ఆధిక్యంలో ఆస్ట్రేలియా

ఇక, మెల్‌బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టీ20 వర్షం కారణంగా రద్దైంది. దీంతో మూడు టీ20ల సిరిస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌ను సమం చేయాలంటే చివరి మ్యాచ్‌లో టీమిండియా కచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదివారం సిడ్నీ వేదికగా ఆఖరి టీ20 జరగనుంది.

Story first published: Saturday, November 24, 2018, 15:58 [IST]
Other articles published on Nov 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+