Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : తొలి టెస్టు పిచ్‌ చూసి షాక్.. గెలిచేందుకు భారత్ కుట్ర అంటున్న ఆసీస్!

Australia experts slams India for malicious pitch at Nagpur

ఆస్ట్రేలియా, భారత్ రెండు జట్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో సిరీస్ మొదలవడానికి ముందు నుంచే ఆస్ట్రేలియా మాజీలంతా భారత్‌లో పిచ్‌లపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తొలి టెస్టు పిచ్ ఎలా ఉందో చూసిన తర్వాత వాళ్ల విమర్శలు మరో మెట్టు పైకెక్కాయి.

బీసీసీఐ కావాలనే ఇలాంటి పిచ్‌లు తయారు చేస్తూ తొండాట ఆడుతోందని విమర్శలు చేస్తున్నారు.

పిచ్ ఎలా ఉందంటే?

పిచ్ ఎలా ఉందంటే?

నాగ్‌పూర్ పిచ్‌ను తయారు చేసే సమయంలో క్యురేటర్లు పూర్తిగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను దృష్టిలో పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈ పిచ్‌కు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పిచ్‌లో అనుకున్నంత బౌన్స్ ఉండబోదని ఇప్పటికే ఆసీస్ జట్టులోని ఎక్స్‌పర్టులు చెప్పేశారు. అలాగే స్పిన్నర్లకు పిచ్ నుంచి మంచి సహకారం లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అశ్విన్, జడేజా వంటి వాళ్లు ఈ పిచ్ చూసిన వెంటనే ఆస్ట్రేలియా బ్యాటర్లకు బౌలింగ్ చేయడానికి ఎగిరి గంతేస్తారు.

లెఫ్ట్ హ్యాండర్లే టార్గెట్?

లెఫ్ట్ హ్యాండర్లే టార్గెట్?

ఆస్ట్రేలియా జట్టులోని తొలి 8 మంది బ్యాటర్లలో కనీసం ఐదుగురు ఎడం చేతి వాటం బ్యాటర్లే కావడం గమనార్హం. వాళ్లు నాగ్‌పూర్ పిచ్‌పై భారీ స్కోర్లు చేయడం చాలా కష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఎడం చేతి వాటం బ్యాటర్ల ఆఫ్‌స్టంప్ వైపు భాగాన్ని క్యురేటర్లు పూర్తిగా పొడిగా ఉంచేశారు. అలాగే పిచ్ మధ్యలో చక్కగా తడిపిన వాళ్లు.. కుడిచేతి వాటం బ్యాటర్ల ఆఫ్‌స్టంప్ వద్ద కొద్దిగానే తడిపారు. రోలింగ్ చేసే సమయంలో కూడా మధ్య వరకే చేసినట్లు కొందరు చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈ పిచ్‌పై ఎడం చేతి వాటం బ్యాటర్లు, ముఖ్యంగా స్పిన్ ఆడటానిక కష్టపడే లెఫ్ట్ హ్యాండర్లకు తిప్పలు తప్పేలా లేవు. మరి ఆస్ట్రేలియా బ్యాటర్లు ఈ సవాల్‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

మాజీల మండిపాటు..

మాజీల మండిపాటు..

ఈ పిచ్‌కు సంబంధించిన ఫొటోలు చూసిన వెంటనే ఆస్ట్రేలియా మాజీలు ఆగ్రహంతో ఊగిపోయారు. భారత్ ఇలాంటి చెత్త పిచ్‌లు తయారు చేసి మ్యాచులు గెలవడం సమంజసం కాదని మండిపడ్డారు. ఈ పిచ్ తయారు చేసిన క్యురేటర్లు.. టీమిండియాకు లబ్ది చేకూర్చాలనే కుట్రతోనే దీన్ని తయారు చేశారని క్రికెట్ నిపుణుడు రాబర్ట్ క్రాడూక్ ఆరోపించాడు. 'ఆస్ట్రేలియాలో గబ్బా పిచ్ చూసినప్పుడు రెండు జట్లూ అదే పిచ్‌పై ఆడాయి కదా అంటే ఓకే. కానీ ఈ పిచ్‌పై అలాంటి కామెంట్స్ చెయ్యలేం. ఎందుకంటే ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌లో అందరూ లెఫ్ట్ హ్యాండర్లే. వాళ్లను టార్గెట్ చేస్తూనే ఈ పిచ్ తయారు చేశారు' అన్నాడు. ఆసీస్‌కు చెందిన మరికొందరు మాజీలు కూడా రాబర్డ్ వ్యాఖ్యలతో ఏకీభవించారు. భారత్‌ ఇలా చేసినప్పుడు ఐసీసీ చర్యలు తీసుకోవాలని, కానీ ఎప్పుడూ ఐసీసీ అలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని అక్కసు వెళ్లగక్కారు.

Story first published: Wednesday, February 8, 2023, 13:47 [IST]
Other articles published on Feb 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+