Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes Series 2021: తుది జ‌ట్లను ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌.. కీలక మార్పులతో బరిలోకి

Australia, England announce final teams for Melbourne Test

బాక్సింగ్ డే సంద‌ర్భంగా ఆదివారం నుంచి యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే తొలి రెండు టెస్టు మ్యాచ్‌లు ఓడిన ప‌ర్యాటక జ‌ట్టు ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను కాపాడుకోవాల‌ని భావిస్తుండ‌గా, తొలి రెండు మ్యాచ్‌ల్లో విజ‌యాల‌తో జోరు మీద ఉన్న అతిథ్య కంగారు జ‌ట్టు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవ‌సం చేసుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ మూడో టెస్టు మ్యాచ్‌కు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జ‌ట్లు తాజాగా త‌మ తుది జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి.

 నాలుగు మార్పుల‌తో బ‌రిలోకి ఇంగ్లండ్‌

నాలుగు మార్పుల‌తో బ‌రిలోకి ఇంగ్లండ్‌

తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఓడి సిరీస్‌లో వెనుబ‌డిన ఇంగ్లండ్‌కు సిరీస్ కాపాడుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు త‌ప్ప‌నిస‌రి. ఈ నేప‌థ్యంలో త‌మ తుది జ‌ట్టులో ఇంగ్లండ్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. ఓలీ పోప్ స్థానంలో స్టార్ ఆట‌గాడు జానీ బెయిర్‌స్టో జట్టులోకి వ‌చ్చాడు. అలాగే తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో విఫ‌ల‌మైన ఓపెన‌ర్ రోరీ బర్న్స్ స్థానంలో జాక్‌ క్రాలీని జ‌ట్టులోకి తీసుకున్నారు. మ‌రోవైపు విశ్రాంతి పేరుతో స్టార్ ఆట‌గాళ్లు క్రిస్‌ వోక్స్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ను ప‌క్క‌నబెట్టారు. వారి స్థానంలో మార్క్‌ వుడ్‌, స్పిన్న‌ర్‌ జాక్‌ లీచ్ జ‌ట్టులోకి వ‌చ్చారు. దీంతో ఈ మ్యాచ్‌లోనైనా ఇంగ్లండ్ సత్తా చాటి సిరీస్ రేసులో నిల‌బ‌డుతుందేమో చూడాలి.

ఇంగ్లండ్ తుది జ‌ట్టు:

హసీబ్ హమీద్, జాక్ క్రాలే, డేవిడ్ మలన్, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), మార్క్ వుడ్, అలీ రాబిన్సన్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్.

 జట్టులోకి వ‌చ్చిన ఆసీస్ కెప్టెన్

జట్టులోకి వ‌చ్చిన ఆసీస్ కెప్టెన్

మ‌రోవైపు అతిథ్య ఆస్ట్రేలియా కూడా త‌మ తుది జ‌ట్టును ప్ర‌క‌టించింది. క‌రోనా సోకిన వ్య‌క్తితో స‌న్నిహితంగా మెలిగిన కార‌ణంగా రెండో టెస్ట్ మ్యాచ్‌కు దూర‌మైన ఆసీస్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆడుతున్నాడు. దీంతో రెండో టెస్టులో ఆడిన మైఖేల్ నెజ‌ర్ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. అదే విధంగా మ‌రో పేస‌ర్‌ రిచ‌ర్డ్స‌న్‌ను కూడా ఈ మ్యాచ్ నుంచి త‌ప్పించారు. అత‌ని స్థానంలో స్కాట్ బోలాండ్ ఆడ‌నున్నాడు. గాయం కార‌ణంగా పేస‌ర్ హేజిల్‌వుడ్ ఈ మ్యాచ్ కూడా ఆడ‌డం లేదు.

ఆస్ట్రేలియా తుది జ‌ట్టు:

ఆస్ట్రేలియా తుది జ‌ట్టు:

డేవిడ్ వార్నర్, మార్కస్ హారిస్, మార్నస్ ల‌బుషేన్‌, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.

Story first published: Saturday, December 25, 2021, 12:04 [IST]
Other articles published on Dec 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+