
డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అధిపత్యం కొనసాగుతుంది. వరుసగా మూడో రోజు అతిథ్య జట్టు తన అధిపత్యాన్ని కొనసాగించింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్ అధిక్యాన్ని కలుపుకుని ఆసీస్ 282 పరుగుల భారీ అధిక్యంలో ఉంది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్: 45-1. క్రీజులో మార్కస్ హారిస్ 21 పరుగుల(3 ఫోర్లు)తో, మైఖేల్ నెసర్ 2 పరుగులతో ఉన్నాడు. అంతకు ముందు ఓపెనర్ డేవిడ్ వార్నర్ 13 పరుగులు( ఒక ఫోర్) చేసి రనౌట్ అయ్యాడు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు భారీ అధిక్యం
మొదట 2 వికెట్ల నష్టానికి 17 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆ జట్టు కెప్టెన్ జో రూట్, మలాన్ ఆదుకున్నారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామాన్ని నెలకొల్పారు. అయితే ఈ జోడిని గ్రీన్ విడదీశాడు. 7 ఫోర్లతో 62 పరుగులు చేసిన కెప్టెన్ రూట్‌ను గ్రీన్ ఔట్ చేశాడు. ఆ కాసేపటికే 10 ఫోర్లతో 80 పరుగులు చేసిన మలాన్.. స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత ఓలిప్ పోప్(5), జోస్ బట్లర్(0) వెంట వెంటనే ఔట్ అయ్యారు. వీరిద్దరిని లియోన్, స్టార్క్ ఔట్ చేశారు. ఆ తర్వాత జట్టు స్కోర్ 202 పరుగుల వద్ద ఉండగా 5 ఫోర్లతో 24 పరుగులు చేసిన క్రిస్ వోక్స్.. లియోన్ బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ వెంటనే రాబిన్సన్(0), బ్రాడ్(9) కూడా వెంటవెంటనే ఔటయ్యారు. వీరిద్దరిని లియోన్, స్టార్క్ ఔట్ చేశారు. దీంతో ఇంగ్లండ్ 84.1 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 4, లియోన్ 3, గ్రీన్ 2, నెసర్ ఒక వికెట్ తీశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 237 పరుగల భారీ అధిక్యం లభించింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 473-9 వద్ద ఆస్ట్రేలియా స్కోర్‌ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 93 ఓవర్లపాటు సాగిన నేటి మ్యాచ్‌లో 9 వికెట్లు నెలకూలాయి. అదే సమయంలో బ్యాటర్లు 264 పరుగులు సాధించారు.
ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్
కాగా ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆదివారం ఆస్ట్రేలియా వీలైనన్నీ పరుగులు చేసి ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ ఉంచడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇంగ్లీష్ జట్టు భారీ టార్గెట్ ఎలా చేధిస్తుందనేది ఆసక్తిగా మారింది. కాగా తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓడిన సంగతి తెలిసందే. దీంతో 5 టెస్టుల యాషెస్ సిరీస్‌లో ప్రస్తుతం అతిథ్య ఆస్ట్రేలియా 1-0 అధిక్యంలో ఉంది.