For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డే2: ఆసీస్ 260: భారత్ 105: పట్టుసాధించిన ఆసీస్ 143/4, 298 ఆధిక్యం

భారత బౌలర్లు విజృంభించడంతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 260 పరుగులకు ఆటౌట్ అయింది. తొమ్మిది వికెట్ల నష్టానికి 256 పరుగుల వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్...

పుణె: రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్త్రేలియా ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. దీంతో 298 పరుగుల ఆధిక్యాన్ని చాటుకుంది. ప్రస్తుతం స్మిత్ 59, మార్స్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెన్షా 31, హండ్స్‌కోంబ్ 19 పరుగులు చేసి ఔటయ్యారు.

అంతకుముందు 10 పరుగుల వద్ద వార్నర్ వికెట్ కోల్పోయిన ఆసీస్.. 23 పరుగుల వద్ద మార్ష్ వికెట్ కోల్పోయింది. వార్నర్ 10 పరుగులు చేయగా, మార్ష్ డకౌట్ అయ్యాడు. అశ్విన్ 3 వికట్లు తీయగా, జయంత్ 1 వికెట్ తీశాడు.

ఆసీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిల..

260లకు ఆసీస్ ఆలౌట్ కావడంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు తొలి నుంచి తడబడుతూనే వచ్చింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్ విలవిల్లాడిపోయారు. ఒకరి వెంట ఒకరు పెవిలియన్ దారిపట్టారు. ఒక్క కేఎస్ రాహుల్ తప్ప మరెవరూ రాణించలేకపోయారు. దీంతో 105 పరుగులకే భారత్ ఆలౌటౌంది. దీంతో ఆసీస్ 155 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

కేవలం 44 పరుగులకే భారత్ మూడు వికెట్లను కోల్పోయింది. కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ అయి నిరాశపర్చారు. 26 పరులు వద్ద విజయ్, 44 పరుగుల వద్ద పుజారా, విరాట్ కోహ్లీలు వరుసగా ఔటయ్యారు. హజ్లెవుడ్ 1, స్టార్క్ 2 వికెట్లు తీశాడు.

వరుసగా వికెట్ల పతనం

ఆ తర్వాత 64 పరుగులు చేసిన కెఎల్ రాహుల్ 94 పరుగుల వద్ద కీఫే బౌలింగ్‌లో వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 95 పరుగుల వద్ద 13 పరుగులు చేసిన రహానే కూడా కీఫే బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. ఆ వెంటనే 95 పరుగుల వద్దే సహా డకౌట్ అయ్యాడు.

Australia dismissed for 260 in first innings

ఆ వెంటనే 95 పరుగుల వద్దే సహా కూడా డకౌట్ అయ్యాడు. ఒక పరుగు చేసిన అశ్విన్ కూడా 95 పరుగుల వద్దే ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్ క్రీజులో ఉన్నారు. 98 పరుగుల వద్ద 2 పరుగులు చేసిన జయంత్ యాదవ్ ఔటయ్యాడు. 101 పరుగుల వద్ద 2 పరుగులు చేసిన జడేజా ఔటయ్యాడు. 105 పరుగుల వద్ద యాదవ్ 4 పరుగులు చేసి ఔటయ్యాడు.

అద్భుత బౌలింగ్ చేసిన కీఫే

ఓ కీఫే అద్భుత బౌలింగ్ చేసి 6 వికెట్లు తీసి భారత్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. స్టార్క్ 2 వికెట్లు తీయగా, హజ్లెవుడ్, లియాన్ చెరో వికెట్ తీసుకున్నారు.

260కే ఆసీస్ ఆలౌట్

భారత బౌలర్లు విజృంభించడంతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 260 పరుగులకు ఆటౌట్ అయింది. తొమ్మిది వికెట్ల నష్టానికి 256 పరుగుల వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్... శుక్రవారం తొలి ఓవర్లో కేవలం ఐదు బంతులను మాత్రమే ఎదుర్కొని ఆలౌట్ అయింది.

తొలి ఓవర్ ను అశ్విన్ వేయగా... రెండో బంతిని స్టార్క్ బౌండరీ దాటించాడు. ఆ తర్వాత ఐదో బంతికి డీప్ మిడ్ వికెట్ లో జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఒక్క పరుగు చేసిన హాజిల్ ఉడ్ నాటౌట్‌గా మిగిలాడు. ఇండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్ నాలుగు వికెట్లు, అశ్విన్ 3, జడేజా 2, జయంత్ యాదవ్ ఒక్క వికెట్ తీశారు.

ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ ను ప్రారంభించింది. మురళీ విజయ్, లోకేష్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఐదు బంతులను ఎదుర్కొన్న రాహుల్ ఒక్క ఫోర్ బాదాడు. విజయ్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తతం భారత్ స్కోరు వికెట్ నష్టపోకుండా ఐదు పరుగులు (1 ఓవర్).

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+