Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌పై గెలుపు: వెస్టిండీస్ రికార్డ్ ఆస్ట్రేలియా బద్దలు

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా పర్యటనలో.. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ వరుసగా నాలుగు వన్డేలు ఆసిస్ చేతిలో ఓడింది. బుధవారం నాడు నాలుగో వన్డేలో భారత్ 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ గెలుపు ద్వారా ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్లో రికార్డ్ సృష్టించింది.

వరుసగా 18 వన్డేలు గెలిచిన వెస్టిండీస్ రికార్డ్‌ను ఆస్ట్రేలియా తాజా నాలుగో వన్డేతో తుడిచేసింది. గతంలో వెస్టిండీస్ వరుసగా పద్దెనిమిది వన్డేలు గెలిచింది. ఇప్పుడు భారత్ జట్టు పైన గెలిచిన తాజా వన్డే ద్వారా ఆసిస్ 19 వరుసగా గెలిచింది.

19 నవంబర్ 2014 నుంచి ఆస్ట్రేలియా వరుసగా వన్డేలు గెలుచుకుంటూ వస్తోంది. తాజాగా భారత్‌తో ఐదు వన్డేల సిరీస్ నడుస్తోంది. తద్వారా వెస్టిండీస్‌ను బీట్ చేసింది. గతంలో వరుసగా మ్యాచులు గెలిచిన టాప్ అయిదు జట్లు.

Australia defeat India in Canberra ODI to set world record

19 - ఆస్ట్రేలియా (నవంబర్ 19, 2014 నుంచి జనవరి 20, 2016 వరకు - ఇంకా పూర్తి కాలేదు.)

18 - వెస్టిండీస్ (మార్చ్ 19, 1986 నుంచి ఏప్రిల్ 3, 1990 వరకు)

17 - శ్రీలంక (ఫిబ్రవరి 21, 1996 నుంచి జనవరి 26, 1998 వరకు)

16 - సౌతాఫ్రికా (ఫిబ్రవరి 2, 2005 నుంచి మార్చ్ 3, 2006 వరకు)

14 - సౌతాఫ్రికా (జనవరి 13, 1996 నుంచి మార్చ్ 29, 1997 వరకు)

కాగా, నాలుగో వన్డేలో ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్‌లు తొలి వికెట్‌కు 187 పరుగులు జత చేశారు. ఫించ్ 107 (107 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులు), వార్నర్ 93 పరుగులు (92 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్)తో అదరగొట్టారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+