Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి టెస్టు : భారత్ ముందు 299 పరుగులు

Australia
బెంగుళూరు: బెంగుళూరులో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా 299 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. ఐదో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపట్లో 35 పరుగులు చేసిన తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను ఆరు వికెట్ల నష్టానికి 228 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఐదో రోజు ఉదయం షేన్ వాట్సన్ 41 పరుగుల వద్ద ఇశాంత్ శర్మ క్లీన్ బౌల్డ్ చేశాడు. హాడిన్ (35), వైట్ (18)లు క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ మూడు, హర్భజన్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా, జహీర్ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 430 పరుగులు చేయగా, దానికి సమాధానంగా భారత్ 370 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత్ ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్ చేతులెత్తేసినా, జహీర్‌ఖాన్, హర్భజన్ సింగ్‌లు అర్థ సెంచరీలతో ఇన్నింగ్స్ టాప్ స్కోరర్లుగా నిలవడం గమనార్హం. లంచ్ సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది.
Story first published: Monday, October 13, 2008, 14:16 [IST]
Other articles published on Oct 13, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+