కోహ్లీపై ఎందుకంత కసి: ట్రంప్‌తో పోల్చిన ఆసీస్ మీడియా
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మీడియా విషం కక్కుతూనే ఉంది. మొన్న కోహ్లీని జంతువులతో పోల్చిన ఆసీస్ మీడియా తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోల్చుతూ ఆస్ట్రేలియా పత్రిక డైలీ టెలిగ్రాఫ్ తన అక్కసు వెళ్లగక్కింది.
భారత్, ఆస్ట్రేలియాల మధ్య రాంచీ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. 'విరాట్ కోహ్లీ ప్రపంచ క్రీడలో డొనాల్డ్ ట్రంప్‌గా మారాడు. ట్రంప్‌లాగే అతడూ తన ముఖంపై ఉన్న కోడిగుడ్ల మరకలను దాచిపెట్టుకొంటూ మీడియాను అవమాన పరచాలని నిర్ణయించుకున్నాడు' అని రాంచీ టెస్టు మ్యాచ్ అనంతరం డైలీ టెలిగ్రాఫ్ ఓ కథనాన్ని రాసుకొచ్చింది.
రాంచీ టెస్టు తొలిరోజున టీమిండియా కెప్టెన్ కోహ్లీ గాయపడిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా రెండో రోజు ఆటకు కోహ్లీ దూరమయ్యాడు. దీనిపై ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోహ్లీని ఎగతాళి చేయడం, కోహ్లీ కూడా కాస్తంత ఘాటుగానే స్పందించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాత్‌ను ఆస్ట్రేలియా ఆటగాళ్లు అవమానించారని కెప్టెన్ కోహ్లీ ఆరోపించాడు.

కోహ్లీపై టెలిగ్రాఫ్ కథనం
‘ఆస్ట్రేలియా ఆటగాళ్లు నలుగురైదుగురు అదే పనిగా పాట్రిక్ పేరు ఎత్తడం గమనించాను. అతను మా జట్టు ఫిజియో. గాయపడ్డ ఆటగాళ్లకు వైద్యసేవలు చేస్తాడు. అతన్ని బయటికి లాగడం వెనుక ఉన్నా కారణమేంటో తెలియడం లేదు' అని కోహ్లీ అన్నాడు. ఈ ఘటనపై కూడా టెలిగ్రాఫ్ స్పందించింది.

ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాత్‌ను అవమానించారు
భారత జట్టు ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాత్‌ను కొంత మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు కావాలని అగౌరవపరిచారంటూ కోహ్లి ఆరోపించడాన్ని టెలిగ్రాఫ్ ఈ సందర్భంగా తప్పుబట్టింది. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ అయితే కోహ్లీని లక్ష్యంగా చేసుకుంది. నిజానికి బెంగుళూరు టెస్టులో డీఆర్ఎస్ డ్రెస్సింగ్ రూమ్ వివాదాన్ని కోహ్లీ తెరపైకి తీసుకురావడంతో పాటు ఆసీస్ ఆటగాళ్లు అడ్డంగా దొరికిపోయిన వైనం ఆ దేశ మీడియా మద్దతుగా ఎంతమాత్రం రుచించడం లేదు.

కోహ్లీ అనవసరపు ఆరోపణలు
ఆసీస్ కెప్టెన్‌పై కోహ్లీ అనవసరపు ఆరోపణలు చేశాడని తొలుత విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత కోహ్లీసేన సాక్ష్యాధారాలతో నిరూపించడంతో ఆస్ట్రేలియన్ల పరువు పోయింది. ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా పరువు పోయింది. దీంతో వీరికి మద్దతిచ్చేందుకు అక్కడి మీడియా కోహ్లీపై ఉన్నవీ లేనివీ రాయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా కోహ్లీని ట్రంప్‌తో పోల్చింది.

మైండ్ గేమ్‌తో కోహ్లీని దెబ్బతీయాలని
మరోవైపు ఆసీస్ మీడియాకు కలిసొచ్చే అంశం ఏంటంటే ఈ సిరిస్‌లో కోహ్లీ అశించిన మేరకు రాణించలేదు. ఈ సిరిస్‌లో కోహ్లీని మైండ్ గేమ్‌తో దెబ్బతీయాలని ఆసీస్ మీడియో ప్రయత్నిస్తోంది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన మాక్స్‌వెల్ భుజంనొప్పితో మైదానాన్ని వీడిన కోహ్లీని అనుకరించడం కవ్వింపు చర్యల్లో భాగమే. దీనికి తోడు తాజాగా ఆసీస్ మీడియా కోహ్లీపై రాయలేని విధంగా పచ్చి అబద్దాలు రాస్తూ ధర్మశాలలో జరిగే టెస్టులో పైచేయి సాధించాలనే ఉద్దేశంతో ఇదంతా ముందస్తు వ్యూహంలాగే కనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications