Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Steve Smith: లాయర్ కమ్ స్విమ్మర్.. స్టీవ్ స్మిత్ భార్య అందం చూస్తే కళ్లు తిప్పుకోలేరంతే!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీస్ లో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఓటమితో ఇంటిముఖం పట్టడం, ఆ వెంటనే ఓటమి బాధలో ఉన్న స్టీవ్ స్మిత్ ను విరాట్ కోహ్లీ హత్తుకుని ఓదార్చాడం, అనంతరం స్టీవ్ స్మిత్ వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం.. ఇలా ఒకదాని తర్వాత మరొకటి వరుసగా చోటు చేసుకోవడంతో అతడి పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

అభిమానులంతా మేటి ప్లేయర్ అయిన స్మిత్ ను ఓవైపు ఓదారుస్తూనే మరోవైపు భారత్ ఫైనల్ కు అర్హత సాధించడంలో ఆనందంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్మిత్ కు సంబంధించిన వన్డే రికార్డులు, వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మనం అతడి అందమైన భార్య డానీ విల్లీస్ గురించి తెలుసుకుందాం..

Australia cricketer Retirement Steve Smith wife Dani Willis love story Dating details

ఫ్యాషన్ సెన్స్..
స్టీవ్ స్మిత్ భార్య డానీ విల్లీస్ చాలా మంది క్రికెట్ అభిమానులకు తెలిసే ఉంటుంది. ఐపీఎల్ సమయంలో స్మిత్ తో పాటు భారత్ కు వచ్చి క్రికెట్ అభిమానులను తన అందంతో అలరించేది. ఈమె ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రెస్. టాప్ టు బాటమ్ వేసుకునే చెప్పులు నుంచి ధరించే డ్రెస్, మేకప్ హెయిర్ స్టైల్ వరకు ఇలా ఫ్యాషన్ సెన్స్ ఆమెలో బాగా కనపడుతుంది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్..
ఇన్ స్టాగ్రామ్ లోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ను ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ తో పంచుకుంటూనే ఉంటుంది. స్మిత్ తో గడిపిన అద్భుత క్షణాలు, ట్రావెల్ అడ్వెంచర్స్, లైఫ్ స్టైల్ కంటెంట్ ఇలా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పంచుకోవడం వల్ల క్రికెట్ ఫ్యాన్స్ లో మంచి పాపులారిటినీ సంపాదించుకుంది.

స్మిత్ కు బ్యాక్ బోన్ గా...
స్మిత్ కు విల్లీస్ ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది. అతడి ప్రతి అడుగులోనూ తోడుంటుంది. ముఖ్యంగా అతడు నిషేధానికి గురైనప్పుడు అండగా నిలిచింది. వీరిద్దరు 2011-12లో బిగ్ బాష్ లీగ్ సమయంలో కలుసుకున్నారు. అప్పుడు విల్లీస్ స్టూడెంట్. అలా ఆరేళ్ల పాటు డేటింగ్ చేసిన వీరిద్దరు పెళ్లిచేసుకున్నారు.

మొదట స్మిత్ 2017లో ప్రపోజ్ చేయగా.. 2018 సెప్టెంబర్ 15న పెళ్లి చేసుకున్నారు. విల్లీస్ న్యాయవాది కూడా. అలానే కాలేజీ సమయంలో స్విమ్మర్ గా రాణించేది. పోలో ప్లేయర్‌ కూడా. మొత్తంగా వీరిద్దరికి ఒకరిపట్ల మరొకరికి ఉన్న గౌరవం, సపోర్టివ్ నెస్ ఎంతో మంది కపుల్స్ కు ఆదర్శంగా నిలిచింది.

Story first published: Wednesday, March 5, 2025, 14:19 [IST]
Other articles published on Mar 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+