Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'2019లో కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటా'

Australia coach Lehmann to step down in 2019

హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు కోచ్‌గా తన పదవీ కాలాన్ని పొడిగించుకునే ఉద్దేశం ఎంతమాత్రం లేదని ఆ జట్టు హెడ్ కోచ్ డారెన్ లీమన్ చెప్పాడు. 2019 చివర్లో ఆస్ట్రేలియా ప్రధాన కోచ్‌ పదవికి వీడ్కోలు పలుకుతానని ఫాక్స్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం డారెన్ లీమన్ 2019 చివరి వరకు కోచ్‌గా కొనసాగుతానని పేర్కొన్నాడు. 'సుదీర్ఘ కాలంగా ఆసీస్‌ జట్టుకు కోచ్‌గా సేవలందిస్తున్నా. నాకు అప్పచెప్పిన పనిని ఎంతగానో ఎంజాయ్‌ చేశా. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇక తిరిగి కోచ్‌ బాధ్యతలు చేపట్టడానికి సిద్దంగా లేను. 2019 చివరి వరకూ కోచ్‌గా కొనసాగుతా' అని లీమన్‌ చెప్పాడు.

2013లో కోచ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డారెన్ లీమన్‌ పర్యవేక్షణలో ఆస్ట్రేలియా జట్టు స్వదేశంలో రెండు యాషెస్ సిరిస్‌లను గెలుచుకోగా, ఇంగ్లాండ్‌లో రెండు యాషెస్ సిరిస్‌ల్లో ఓటమి పాలైంది. అంతేకాదు 2015 వన్డే వరల్డ్ కప్‌ను కూడా గెలుచుకుంది.

భారత పర్యటనలో ఆసీస్‌ ఘోర ఓటమి కారణంగా అప్పటి కోచ్‌గా ఉన్న మికీ ఆర్థర్‌పై వేటు వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా లీమన్‌కు ఆ పదవిని అప్పజెప్పింది. తనకు అందివచ్చిన అవకాశాన్ని డారెన్ లీమన్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. అనేక ఆసీస్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ఇదిలా ఉంటే డారెన్ లీమన్ స్థానాన్ని ఆసీస్ మాటీ టెస్టు ఓపెనర్ జస్టిన్ లాంగర్ భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. కోచ్ రేసులో లాంగర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే జస్టిన్ లాంగర్ పర్యవేక్షణలో వెస్టర్న్ ఆస్ట్రేలియా, పెర్త్ షాకర్స్ జట్లు అద్భుత విజయాలు సొంతం చేసుకుంటున్నాయి.

Story first published: Monday, December 25, 2017, 16:02 [IST]
Other articles published on Dec 25, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+