బాక్సింగ్ డే టెస్టులో పాక్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం
హైదరాబాద్: గత కొంతకాలంగా టెస్టుల్లో వరుస వైఫల్యాలను చవిచూసిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఎట్టకేలకు తన పూర్వ వైభవాన్ని చాటుకుంది. మెల్‌బోర్న్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇంకో టెస్టు మిగిలి ఉండగానే సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు రాణించడంతో పాకిస్థాన్ కనీసం పోరాడకుండానే చేతులెత్తేసింది. అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ పరుగుల వేటలో మరోసారి తడబడింది. తొలి టెస్టులో ఓటమి పాలైనప్పటికీ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
రెండో టెస్టు:
తొలి ఇన్నింగ్స్
పాకిస్థాన్: 443/9 డిక్లేర్
ఆస్ట్రేలియా: 624/8 డిక్లేర్
రెండో ఇన్నింగ్స్:
పాకిస్థాన్: 163 ఆలౌట్
మ్యాచ్ ఫలితం: ఇన్నింగ్స్ 18 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం

పోరాడకుండానే చేతులెత్తేసిన ఆస్ట్రేలియా
అయితే రెండో టెస్టులో ఆశించిన మేరకు ఆటగాళ్లు ప్రభావం చూపలేకపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ తన తొలి ఇన్నింగ్స్‌ను 443/9 వద్ద డిక్లేర్ చేసింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో అజహర్ అలీ డబుల్ సెంచరీని చేయగా, సోహైల్ ఖాన్, అసద్ షఫీఖ్ అర్ధసెంచరీలను నమోదు చేశారు.

తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగుల ఆధిక్యం
అనంతరం బ్యాటింగ్ కొనసాగించిన ఆస్ట్రేలియా 624/8 వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. స్టీవ్ స్మిత్(165 నాటౌట్), డేవిడ్ వార్నర్(144), హ్యాండ్ స్కాంబ్(54), స్టార్క్(84) లు రాణించి ఆసీస్ భారీ స్కోరు చేయడంలో సహకరించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

రెండో ఇన్నింగ్స్‌లో 53.2 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌట్
ఇక రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పాకిస్థాన్ 53.2 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూలింది. పాకిస్థాన్ జట్టులో అజహర్ అలీ (43), సర్ఫ్‌రాజ్ అహ్మద్(43) మినహా ఎవరూ రాణించకపోవడంతో పాక్ కు పరాజయం తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు తీసుకోగా, లయన్ మూడు వికెట్లు తీసుకున్నాడు.

స్టీవ్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
ఇక హాజల్‌వుడ్ రెండు వికెట్లు, బర్డ్‌కు ఓ వికెట్ దక్కింది. 165 పరుగులతో టెస్టు కెరీర్‌లో 17వ సెంచరీ సాధించిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా 39 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications