ఆసీస్ 65/2, 348 అవసరం
పెర్త్: పెర్త్ లో భారత్ పై జరుగుతున్న మూడో టెస్టు మ్యాచు మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్సులో రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. భారత్ నిర్దేశించిన 413 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ తన ఇద్దరు ఓపెనర్లను 43 పరుగులకే కోల్పోయింది. ఈ మ్యాచ్ గెలవడానికి ఆసీస్ ఇంకా 348 పరుగులు చేయాల్సి ఉంది. ఇంకా రెండు రోజుల సమయం ఉంది. దీంతో పెర్త్ టెస్టు రసకందాయంలో పడింది.
రోజర్స్ 15 పరుగులు, జాక్విస్ 16 పరుగులు చేసి అవుటయ్యారు. రెండు వికెట్లు కూడా ఇర్ఫాన్ పఠాన్ కే దక్కాయి. ఆట ముగిసే సమయానికి ఆసిస్ కెప్టెన్ రికీ పాంటింగ్ 24 పరుగులతో, హస్సీ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు 294 పరుగుల వద్ద భారత్ రెండో ఇన్నింగ్సు ముగిసింది.
Story first published: Friday, January 18, 2008, 16:23 [IST]
Other articles published on Jan 18, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications