పెర్త్: భారత్ యంగ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బరిందర్ శ్రాన్ మంగళవారం నాడు తన తొలి అంతర్జాతీయ ఆరంగేట్రంలోనే స్లెడ్జింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ ఈ కొత్త బౌలర్ శ్రాన్‌ను తొలి వన్డే సందర్భంగా టార్గెట్ చేశాడు.
23 ఏళ్ల బరిందర్ శ్రాన్ పెర్త్‌లోని వాకా స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ ఆరంగేట్ర మ్యాచులోనే సత్తా చాటాడు. అతను మూడు వికెట్లు తీశాడు.
శ్రాన్ తొలి స్పెల్‌లో 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఆరోన్ ఫించ్ (8), డేవిడ్ వార్నర్ (5) వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా లక్ష్యం 310గా ఉంది. బరిందర్ శ్రాన్ ఆరు ఓవర్లు వేసిన అనంతరం సారథి మహేందర్ సింగ్ ధోనీ 40వ ఓవర్ వరకు అతనిని ఆపాడు.

ఆ తర్వాత బౌలింగ్ ఇచ్చేందుకు ధోనీ అతనిని ఆపాడు. బరిందర్ శ్రాన్ తన రెండో స్పెల్‌లో వేస్తున్నప్పుడు బెయిలీ, స్మిత్ క్రీజులో ఉన్నారు. బరిందర్ శ్రాన్ 45వ ఓవర్ వేస్తున్న సమయంలో... స్మిత్ ఏదో మాటలు అన్నాడు. అయితే, బరిందర్ శ్రాన్ బౌలింగులో బౌండరీకి బాల్ పంపిన స్మిత్ మరోసారి ఏదో అన్నాడు.
అయితే, శ్రాన్ దానిని పట్టించుకోలేదు. అతని మాటలకు ప్రతి స్పందించే బదులు.. మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత స్మిత్‌ను (149) అవుట్ చేసిన బరిందర్ శ్రాన్ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే, అప్పటికే మ్యాచ్ భారత్ చేజారిపోయింది.