Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డే అండ్ నైట్ టెస్ట్‌లో కరోనా కలకలం.. ఆస్ట్రేలియా కెప్టెన్ ఔట్

Australia captain Pat Cummins out of 2nd Ashes test

యాషెస్ టెస్ట్ 2021లో భాగంగా నేటి నుంచి ఆడిలైడ్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పింక్ బాల్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్. అయితే మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు అతిథ్య ఆస్ట్రేలియా జట్టులో కరోనా కలకలం రేగింది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కరోనా కారణంగా ఈ పింక్ బాల్ టెస్ట్‌కు దూరమయ్యాడు. దీంతో కమిన్స్ స్థానంలో స్టీవెన్ స్మిత్ ఆస్ట్రేలియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. కమిన్స్ స్థానంలో మైఖేల్ నెసర్ జట్టులోకి వచ్చాడు. కాగా యాషెస్ సిరీస్‌లో నెసర్‌కు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్.

 అసలు కమిన్స్‌కు ఏమైంది?

అసలు కమిన్స్‌కు ఏమైంది?

ఆడిలైడ్ టెస్టు మ్యాచ్‌కు ముందు కమిన్స్ డిన్నర్ కోసం ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ కమిన్స్ డిన్నర్ చేసిన టేబుల్‌కు పక్కన్ టేబుల్ వద్ద కరోనా సోకిన వ్యక్తి ఉన్నాడు. కమిన్స్ ఆ కరోనా బాధితుడితో సన్నిహితంగా మెలిగాడు. దీంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. కమిన్స్‌కు కరోనా నిర్ధారణ కానప్పటికీ ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నాడు.

ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవికరించింది. అయితే కమిన్స్ 26 నుంచి మెల్‌బోర్న్‌లో జరిగే మూడో టెస్టుకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. దీంతో బాల్ ట్యాపరింగ్‌తో సస్పెన్షన్‌తోపాటు కెప్టెన్సీకి దూరమైన స్టీవ్ స్మిత్‌కు చాలా కాలం తర్వాత మళ్లీ నాయకత్వ బాధ్యతలు దక్కాయి.

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

యాషెస్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న డే అండ్ నైట్ టెస్ట్‌లో అతిథ్య జట్టు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి టెస్ట్‌లో గెలిచి అతిథ్య ఆసీస్ జోరు మీదుండగా.. ఇంగ్లండ్ మాత్రం ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని ఉవ్విల్లు ఊరుతుంది. ఈ డే అండ్ నైట్ టెస్ట్‌ను ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1 తో సమం చేయాలని భావిస్తోంది.

జట్లు

జట్లు

ఆస్ట్రేలియా:

డేవిడ్ వార్నర్, మార్కస్ హారిస్, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మైఖేల్ నేజర్, మిచెల్ స్టార్క్, రిచర్డ్సన్, నాథన్ లియాన్

ఇంగ్లండ్:

రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలన్, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, ఆలీ పోప్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, ఆలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్

Story first published: Thursday, December 16, 2021, 11:15 [IST]
Other articles published on Dec 16, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+