'జట్టు తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయింది'


హైదరాబాద్: కొన్నేళ్ల పాటు క్రికెట్ ప్రపంచంలో రారాజులా వెలుగొందిన ఆస్ట్రేలియా జట్టు పరిస్థితి నానాటికీ దిగజారిపోతుంది. ప్రస్తుతం వరుస ఓటములతో కాలం వెల్లదీస్తోంది. జరుగుతోన్న క్యాలెండర్ ఇయర్‌లో 13 మ్యాచ్‌లాడిన కంగారూలు కేవలం 3 విజయాలకు పరిమితమయ్యారు. దీన్ని బట్టే చెప్పొచ్చు ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.

ఆసీస్ కంటే మెరుగ్గా టీమిండియా
2016/17లో న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ను 2-0తో గెలువడమే ఆసీస్‌కు ఆఖరిది. ప్రపంచకప్ మెగా టోర్నీకి పట్టుమని 10 నెలలు కూడా లేని సమయాన ఆసీస్ వరుసగా నాలుగు వన్డే సిరీస్‌లను చేజార్చుకోవడం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా 3 వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికాకు చేజార్చుకున్న ఆసీస్.. వచ్చే ఏడాది మొదట్లో భారత్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఫామ్ పరంగా చూసుకుంటే ఆసీస్ కంటే మెరుగ్గా టీమిండియా వరుస సిరీస్ విజయాలతో వన్డేల్లో ఇంగ్లాండ్ తర్వాత రెండో ర్యాంక్‌లో కొనసాగుతుంది.

ఆసీస్ ఒత్తిడిలో కూరుకుపోయిందని
ఈ నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ ఫించ్ స్పందిస్తూ..తమ జట్టంతా ప్రస్తుతం ఒత్తిడిలో కూరుకుపోయి ఉందని పేర్కొన్నాడు. జట్టు కూర్పు సరిగ్గా లేదు. సీనియర్లు స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్ గైర్హాజరీలో బ్యాటింగ్ ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. మ్యాచ్ మ్యాచ్‌కు మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్న సానుకూల ఫలితాలు దక్కడం లేదు. సిరీస్‌లో రెండుసార్లు మార్పులు చేశాం.

బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏ మాత్రం కలిసిరాక
బ్యాటింగ్ ఆర్డర్‌లో డార్కీ షార్ట్, షాన్ మార్ష్, క్రిస్ లిన్ మార్చడం ఎంత మాత్రం కలిసిరాలేదు. ఇదే రీతిలో భారత్‌తో సిరీస్‌లో ఆడితే కచ్చితంగా ఓడిపోవడం ఖాయం అని ఫించ్ అన్నాడు. వచ్చే ఏడాది జనవరి 12న సిడ్నీలో ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది.

ఫించ్ సరిగ్గా సరిపోతాడని
‘ప్రస్తుత క్రికెట్‌లో ఫించ్ అన్ని రకాల ఫార్మాట్‌లలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్. అతను మొదటి నుంచి ఆరో స్థానం వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. ముఖ్యంగా భారత్ వంటి జట్టుతో కఠిన టెస్టు సిరీస్ నేపథ్యంలో మా జట్టుకిది బాగా కలిసొచ్చే అంశం. నాకు తెలిసి ఓపెనర్‌గా దిగటానికి అతను అన్ని విధాలా అర్హుడే. కానీ ముందు రోజుల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు.' అని ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ టిమ్ పైనె చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications