
ఆస్ట్రేలియా టీం పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక స్టేట్‌మెంట్ హింట్ పూర్వకంగా ఇచ్చాడు. 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత తనతో పాటు వయసు మీద పడ్డ మిగతా ప్లేయర్లు టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ నెలల్లో టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇక గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఈ సారి తమ సొంత ప్రేక్షకుల ముందు గెలిచి సొంత గడ్డపై తన ఆధిపత్యాన్ని చూపించాలని ప్రయత్నిస్తుంది. అలాగే ఇక సొంత ప్రేక్షకుల ముందు ఘనంగా వీడ్కోలు పలకాలని వయసుమీరిన ప్లేయర్లు కూడా భావిస్తున్నారు. ఇక గత ఎడిషన్‌లో జట్టు హీరోగా నిలిచిన 35ఏళ్ల మాథ్యూ వేడ్ సైతం ఈ టోర్నీ తర్వాత టీ20 ప్రపంచకప్ ఫార్మాట్ నుంచి వైదొలగనున్నట్టు ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇక Cricket.com.auతో 35ఏళ్ల ఫించ్ మాట్లాడుతూ చాలా హింట్లు ఇచ్చాడు. జట్టులోని కొందరు ఆటగాళ్లకు టీ20 ప్రపంచకప్ టోర్నీ కెరీర్ ఫుల్ స్టాప్ కావచ్చని, ఈ టోర్నమెంట్ వారికి అద్భుత ముగింపు అందించగలదని ఆశిస్తున్నట్లు చెప్పాడు. 'మంచి ముగింపునకు ప్లాన్ చేసుకుంటే (నాతో సహా పలువురు ఆటగాళ్లు టీ20ల నుండి రిటైర్మెంట్ చెప్పొచ్చు) టీ20 ఫార్మాట్‌కు నాతో సహా వయసు పడ్డ ఆటగాళ్ల కెరీర్‌కు ఫుల్ స్టాప్ పడవచ్చు. ఇక ముగింపు అద్భుతంగా ముగియొచ్చని ఆశిస్తున్నా. సహజంగానే ప్లేయర్లు 35ఏళ్ల వయసుకు చేరుకున్నప్పుడు.. రిటైర్మెంట్ ప్రకటించడానికి సరైన తరుణాల కోసం వెయిట్ చేస్తుంటారు. మా జట్టులో డేవిడ్ వార్నర్ మాత్రం కంటిన్యూ అవుతాడు. ఎందుకంటే అతను మరో 10సంవత్సరాలు కూడా ఆడగలడు.
అతను ఎంత ఫిట్‌గా ఉంటాడో మనం చూస్తూనే ఉంటాం. అలాగే అతను సవాళ్లను ఎంతగా ఇష్టపడతాడో మనకు తెలుసు. అతను తనను తాను సవాలు చేసుకుంటూ మరింత ఎక్కువ కాలం కొనసాగుతాడని నేను అనుకుంటున్నాను' అని ఫించ్ పేర్కొన్నాడు. వేడ్, హెన్రిక్స్, ఫించ్, డేవిడ్ వార్నర్ 35ఏళ్లు పైబడ్డ వయసులో ఉన్నారు.
ఇకపోతే టీ20 ప్రపంచ కప్ చాలా కఠినమైన ఫార్మాట్ అని ఫించ్ చెప్పాడు. గత ఎడిషన్లో దక్షిణాఫ్రికా టీంను ఉదాహరిస్తూ.. ఆ టీం నాలుగు గేమ్‌లు గెలిచినప్పటికీ.. నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. ఎందుకంటే వారి నెట్ రన్ రేట్ బాలేదు. దీన్ని బట్టి ఈ ఫార్మాట్ ఎలాంటిదో చెప్పొచ్చు. ఎంత బాగా రాణించినా.. ఈ ఫార్మాట్లో గెలవాలంటే కొంచెం అదృష్టం కూడా అవసరం అని ఫించ్ పేర్కొన్నాడు.