100వ వన్డేలో డకౌట్: ఆరోన్ ఫించ్ ఖాతాలో చెత్త రికార్డు

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య శనివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
గత కొంతకాలంగా పేలవమైన ఫామ్‌లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ మరోసారి నిరాశపరిచాడు. తొలి వన్డేలో ఆరోన్ ఫించ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో మూడు బంతులను ఎదుర్కొన్న ఫించ్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

బుమ్రా వేసిన రెండో ఓవర్ మూడో బంతికే
భారత పేసర్ బుమ్రా వేసి ఇన‍్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి ఆరోన్ ఫించ్‌ను పెవిలియన్ చేర్చాడు. బుమ్రా బంతిని ఫించ్ షాట్ ఆడబోగా బంతి బ్యాట్‌కు ఎడ్జ్ అయి ధోనీ చేతిలో పడింది. ఈ క్రమంలోనే అరుదైన చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు ఫించ్. ఫించ్‌కు ఇదే 100వ వన్డే కావడం విశేషం.

100వ వన్డేలో డకౌట్‌గా
తన 100వ వన్డేలో డకౌట్‌గా నిష్క్రమించడంతో ఆసీస్ తరఫున ఇలా వందో మ్యాచ్‌లో డకౌట్‌గా ఔటైన మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతకముందు డీన్ జోన్స్, క్రెయిగ్ మెక్‌డెర్మట్‌లు వందో వన్డేలో డకౌట్‌గా ఔటైన ఆసీస్ క్రికెటర్లు. ఇప్పుడు వారి సరసర ఆరోన్ ఫించ్ చేరాడు. 2018-19 సీజన్‌లో ఆరోన్ ఫించ్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు.

టెస్టుల్లో 27.80 సగటు నమోదు చేయగా
టెస్టుల్లో 27.80 సగటు నమోదు చేయగా, వన్డేల్లో 11.85 సగటు మాత్రమే చేశాడు. ఇక టీ20ల్లో 7.50 సగటుతో ఉన్నాడు. టాస్ అనంతరం వికెట్ పొడిగా కనిపిస్తోందని, అందుకే మొదట బ్యాటింగ్ చేయాలని అనుకుంటాన్నమని ఫించ్ చెప్పాడు. భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తామని భావిస్తున్నామని అన్నాడు. రిచర్డ్‌సన్ స్థానంలో అలెక్స్ కారేను తీసుకున్నట్లు తెలిపాడు.

జట్టు ప్రదర్శనపై అంచనాలు
అలాగే, ఈ మ్యాచ్ ద్వారా వెస్టర్ట్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఆష్టన్ టర్నర్ ఆరంగేట్రం చేస్తున్నట్లు తెలిపాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో పూర్తిస్థాయి ప్రపంచకప్ జట్టు బరిలో దిగుతోంది. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై అంచనాలు బాగా నెలకొన్నాయి. సొంతగడ్డపై టీ20 సిరీస్‌ను చేజార్చుకున్న భారత్.. వన్డే సిరీస్‌తో ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications