నాలుగో యాషెస్ టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి ముంగిట నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ చెలరేగింది. ఆ టీం ఓపెనర్ జాక్ క్రాలీ (189) అద్భుతమైన శతకంతో చెలరేగాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా ఆకట్టుకున్నారు. ఈ టీంలో ఏకంగా ఆరుగురు హాఫ్ సెంచరీ మార్కు దాటడం గమనార్హం.
మొయీన్ అలీ (54), జో రూట్ (84), బెన్ స్టోక్స్ (61), హ్యారీ బ్రూక్ (51), జానీ బెయిర్‌స్టో (99 నాటౌట్) అద్భుతంగా ఆడారు. దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 597 పరుగులు చేసింది. చివర్లో జేమ్స్ ఆండర్సన్ (5) అవుటవకపోయి ఉంటే బెయిర్‌స్టో శతకం కూడా పూర్తి చేసుకునే వాడే. ఈ భారీ స్కోరుతో ఇంగ్లండ్ 247 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా బ్యాటర్లు చాలా తడబడ్డారు.

ఉస్మాన్ ఖవాజా (18), డేవిడ్ వార్నర్ (28) ఇద్దరూ తేలిపోయారు. ఆ తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ (17) దారుణంగా ఫెయిలయ్యాడు. ట్రావిస్ హెడ్ (1) కూడా ఘోరంగా విఫలమయ్యాడు. అయితే మరో కీలక బ్యాటర్ మార్నస్ లబుషేన్ (44 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతనికి మిచెల్ మార్ష్ (1 నాటౌట్) జతకలిశాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 113/4 స్కోరుతో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలవాలంటే వీళ్లిద్దరి భాగస్వామ్యం చాలా కీలకం. వీళ్లు రాణించినా ఆస్ట్రేలియా విజయం సాధించడం చాలా కష్టమనే చెప్పాలి. ఆసీస్ టీంపై ఏ జట్టూ ఇంత ఆధిపత్యం చెలాయించడం ఇటీవలి కాలంలో చూడలేదని మాజీ దిగ్గజాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంగ్లండ్ టీం ఆ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఈ మ్యాచ్ కనుక ఆసీస్ ఓడితే సిరీస్ పోవడం ఖాయమని నిపుణులు అంటున్నారు.